exhume
-
నెల క్రితం మిస్సింగ్.. 10 అడుగుల లోతులో అస్థిపంజరాలు
భోపాల్: ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరకు ఆమెను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆగ్రహించిన లవర్ ప్రియుడికి కాబోయే భార్య ఫోటో, ఫోన్ నంబర్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేశాడు. వారందరిని పోలంలో పది అడుగుల లోతులో పాతి పెట్టాడు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ నేమవర్ పట్టణానికి చెందిన రూపాలి అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన సురేంద్ర చౌహాన్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల పాటు బాగానే సాగినప్పటికి ఆ తర్వాత సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీని గురించి రూపాలికి తెలిసింది. ఆగ్రహించిన ఆమె సురేంద్ర చేసుకోబోయే యువతి ఫోటో, ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం కాస్త సురేంద్రకు తెలియడంతో రూపాలి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. దానిలో భాగంగా ఈ ఏడాది మే 13న రూపాలి సోదరుడు పవన్ ఓస్వాల్(13)ని కలిసి.. మమతా బాయి కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి (21), దివ్య (14) తో పాటు బంధువుల అమ్మాయి పూజా ఓస్వాల్ (15)ని, తాను చెప్పిన ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒప్పించాడు. వారంతా అక్కడకు చేరుకున్న తర్వాత సురేంద్ర వారిని హత్య చేసి.. సమీప పొలంలో పది అడుగులు గొయ్యి తీసి.. మృతదేహాలను పూడ్చిపెట్టాడు. బయటపడిందిలా.. రూపాలితో పాటు మిగతవారు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేసును పక్కదోవ పట్టించడం కోసం సురేంద్ర, రూపాలి సోషల్ మీడియా నుంచి ఆమెలా పోస్టులు చేస్తుండేవాడు. తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని.. వేరే ప్రాంతంలో ఉంటున్నానని.. మిగతా కుటుంబ సభ్యులు తన దగ్గరే ఉన్నారని మెసేజ్‌లు చేసేవాడు. కాల్ రికార్డ్‌తో వెలుగులోకి వచ్చిన దారుణం.. ఈ మెసేజ్‌లపై పోలీసులకు అనుమానం రావడంతో రూపాలి కాల్ లిస్ట్ చెక్ చేశారు. దానిలో సురేంద్ర నంబర్‌కు ఎక్కువ సార్లు కాల్ చేసినట్లు ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలా అసలు విషయం బయటకు వచ్చింది. తాను రూపాలిని ప్రేమించానని.. కానీ ప్రస్తుతం వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపాడు. ఇందుకు రూపాలి అంగీకరించలేదని తెలిపాడు. రూపాలి బతికుంటే ఎప్పటికైనా ప్రమాదామే అని భావించి ఆమెను, ఆమెతో పాటు తమ ప్రేమ గురించి తెలిసిన మిగతా వారిని చంపేశానన్నాడు. పోలీసులు సురేంద్రతో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లి.. జేసీబీ ద్వారా అస్థిపంజరాలను బయటకు తీశారు. (చదవండి: చావనైనా చస్తాను..పెళ్లికి మాత్రం ఒప్పుకోను) -
శవాలను వెలికి తీసి.. మేకప్ వేసి..
సాక్షి, ప్రత్యేకం : సొంత వారిని కోల్పోతే కలిగే బాధ అనిర్వచనీయం. వారిపై ఉన్న ప్రేమకు గుర్తుగా దాన ధర్మాలు చేయడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ, ఇండోనేసియాలోని దక్షిణ సులావేసి నివసించే ఓ తెగ మాత్రం ఓ చిత్రమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆత్మీయులు మరణిస్తే వారికి కర్మకాండలు నిర్వహించకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచుకుంటారు టొరాజా తెగ ప్రజలు. అలా కొన్నేళ్ల పాటు ఇంట్లో ఉంచుకున్న అనంతరం మృత దేహాలను పూడ్చి పెడతారు. మరణించిన వారి శరీరాల నుంచి దుర్వాసన వెలువడకుండా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో స్నానం చేయిస్తారు. పూడ్చిన మృతదేహాలను ప్రతి ఏడాది పంట చేతికి వచ్చిన సమయంలో వెలికితీస్తారు. వారికి ఇష్టమైన వస్తువులను అలంకరిస్తారు. చనిపోయిన వ్యక్తి బాలిక/మహిళ అయితే ఆమె తలను దువ్వి, మంచి దుస్తులు వేసి అందంగా అలంకరిస్తారు. బాలుడు/పురుషుడు అయితే అతనికి ఇష్టమైన కళ్లజోడు, సిగరెట్, దుస్తులు లాంటి వస్తువులతో అందంగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారు. ఊరేగింపు అనంతరం గేదెలు, పందులను బలి ఇస్తారు. ఇలా చేయడం వల్ల మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని టొరొజా ప్రజల నమ్మకం. మాట్లాడే భాషను రాతలో కూడా చూపిన తొలి తెగ టొరొజానే. అయితే, టొరొజా తెగలో మరణించిన వారి మృత దేహాలను వెలికి తీసి ఊరేగింపు చేసే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు. 'మా ఆత్మీయులను ఇలా పలకరిచడం అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. చనిపోయిన వారి గురించి మేం ఎన్నడూ బాధపడం. మరణం తర్వాత కూడా వారు మాతో మమైకమే ఉంటున్నప్పుడు బాధ దేనికి. పంట చేతికి రావడం, మరణించిన వారిని గుర్తుకు చేసుకోవడం రెండూ సంతోష సందర్భాలే' నని టొరొజా తెగకు చెందిన ఓ వ్యక్తి చెప్పారు. -
వర్షం కోసం మృతదేహం వెలికితీత
కర్ణాటక: వర్షం కోసం సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి దహనసంస్కారాలు నిర్వహించిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి అణెకట్టకు చెందిన మల్లేగౌడ అనే వృద్ధుడు తొన్ని(చర్మం క్రమంగా తెల్లగా మారిపోవడం) సమస్యతో బాధపడుతూ ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పుడు అతని మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఇటీవల ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు తొన్నితో బాధపడుతూ చనిపోయిన వారిని ఖననం చేయకూడదని, అలా చేసినందువల్లే గ్రామం తీవ్ర వర్షాభావంతో సతమతమవుతోందని చెప్పాడు. దీన్ని నమ్మిన గ్రామస్తులు ఆ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి జ్యోతిష్యుడి సూచన మేరకు దహనం చేశారు. ఇందుకు మల్లేగౌడ కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించారు.