Exports Fall
-
కరోనా షాక్: తగ్గిన జువెల్లరీ ఎగుమతులు
సాక్షి,ముంబై: 2020-21లో జెమ్స్ అండ్ జువెల్లరీ పరిశ్రమ ఎగుమతులు 25.71శాతం తగ్గి రూ.1,85,952.34 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్, ప్రయాణ ఆంక్షలే ఈ క్షీణతకు కారణమని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 2019–20లో ఈ పరిశ్రమ స్థూల ఎగుమతులు రూ.2,50,319.89 కోట్లుగా ఉన్నాయి. (మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!) జువెల్లరీ పరిశ్రమకు 2020-21అసాధారణ సంవత్సరమని..కొంతకాలంగా సాధారణ పరిస్థితులు నెలకోవటంతో రెండో అర్ధసంవత్సరంలో ఎగుమతుల్లో రికవరీ నమోదయిందని పేర్కొంది. తొలి మూడు త్రైమాసికాల్లో క్షీణత కనిపించగా.. నాల్గో త్రైమాసికంలో మాత్రం 12.73 శాతం వృద్ధి నమోదయిందని జీజేఈపీసీ చైర్మన్ కోలిన్ షా తెలిపారు. కట్ అండ్ పాలిష్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు గత ఆర్ధిక సంవత్సరంలో 8.87 శాతం తగ్గి రూ.1,32,015.25 కోట్ల నుంచి రూ.1,20,302.04 కోట్లకు చేరాయి. బంగారు ఆభరణాల ఎగుమతులు 57.89 శాతం క్షీణించి రూ.84,270.81 కోట్ల నుంచి రూ.35,483.17 కోట్లకు తగ్గాయి. వెండి ఆభరణాల ఎక్స్‌పోర్ట్స్ మాత్రం వృద్ధి చెందాయి. 43.55 శాతం పెరిగి రూ.11,955.75 కోట్ల నుంచి రూ.17,163.03 కోట్లకు వృద్ధి చెందాయి -
రెండో క్వార్టర్లో 70వేల ఉద్యోగాలు ఫట్!
న్యూఢిల్లీ : సరుకు ఎగుమతులు దిగజారడంతో 2015-16 రెండో త్రైమాసికంలో దాదాపు 70వేల ఉద్యోగాలు గల్లంతు అయ్యాయట. అసోచామ్, థాట్ ఆర్బిట్రేజ్ సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎగుమతి యూనిట్లలో జీవనోపాధి అవకాశాలు తగ్గాయని, ఈ ప్రభావంతో 70వేల ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, సరుకు రవాణా పడిపోవడంతో ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా కోల్పోయారని వెల్లడించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా అధ్యయనం వెల్లడించింది. ఎగుమతి యూనిట్ ఎకానమీ ఎక్కువగా కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి పనిచేస్తుందని, దీంతో కాంట్రాక్టు ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని వివరించింది. దేశీయంగానే భారత్ ఎకానమీలో అదనంగా డిమాండ్‌ను సృష్టించుకోవాలని, అప్పుడైతేనే వృద్ధి బాటను పునఃప్రారంభించుకోవచ్చని అధ్యయనం సూచించింది. దేశీయ డిమాండ్‌తో ఉద్యోగవకాశాలు కల్పించడం కీలకమైన విషయంగా ఈ సర్వే పేర్కొంది. వరుసగా రెండో నెల ఆగస్టులో కూడా భారత్ ఎగుమతులు 0.3 శాతం క్షీణించి, 21.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, లెదర్ ఉత్పత్తుల షిప్మెంట్లు పడిపోవడంతో ఎగుమతులు క్షీణించాయి. బలహీనమైన గ్లోబల్ డిమాండ్, ఆయిల్ ధరల పతనంతో 2014 డిసెంబర్ నుంచి 2016 మే వరకు వరుసగా 18నెలల పాటు ఎగుమతులు కిందకు పడిపోతూనే వచ్చాయి. కేవలం జూన్ నెలలోనే పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, మళ్లీ జూలైలో నెగిటివ్ జోన్లోకి ప్రవేశించాయి.