రెండో క్వార్టర్లో 70వేల ఉద్యోగాలు ఫట్! | Nearly 70,000 Jobs Lost In Second Quarter Of FY16 On Exports Fall: Report | Sakshi
Sakshi News home page

రెండో క్వార్టర్లో 70వేల ఉద్యోగాలు ఫట్!

Published Mon, Sep 19 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

రెండో క్వార్టర్లో 70వేల ఉద్యోగాలు ఫట్!

రెండో క్వార్టర్లో 70వేల ఉద్యోగాలు ఫట్!

న్యూఢిల్లీ : సరుకు ఎగుమతులు దిగజారడంతో 2015-16 రెండో త్రైమాసికంలో దాదాపు 70వేల ఉద్యోగాలు గల్లంతు అయ్యాయట. అసోచామ్, థాట్ ఆర్బిట్రేజ్ సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎగుమతి యూనిట్లలో జీవనోపాధి అవకాశాలు తగ్గాయని, ఈ ప్రభావంతో 70వేల ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, సరుకు రవాణా పడిపోవడంతో ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా కోల్పోయారని వెల్లడించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా అధ్యయనం వెల్లడించింది. 
 
ఎగుమతి యూనిట్ ఎకానమీ ఎక్కువగా కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి పనిచేస్తుందని, దీంతో కాంట్రాక్టు ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని వివరించింది. దేశీయంగానే భారత్ ఎకానమీలో అదనంగా డిమాండ్ను సృష్టించుకోవాలని, అప్పుడైతేనే వృద్ధి బాటను పునఃప్రారంభించుకోవచ్చని అధ్యయనం సూచించింది. దేశీయ డిమాండ్తో ఉద్యోగవకాశాలు కల్పించడం కీలకమైన విషయంగా ఈ సర్వే పేర్కొంది.
 
వరుసగా రెండో నెల ఆగస్టులో కూడా భారత్ ఎగుమతులు 0.3 శాతం క్షీణించి, 21.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, లెదర్ ఉత్పత్తుల షిప్మెంట్లు పడిపోవడంతో ఎగుమతులు క్షీణించాయి. బలహీనమైన గ్లోబల్ డిమాండ్, ఆయిల్ ధరల పతనంతో 2014 డిసెంబర్ నుంచి 2016 మే వరకు వరుసగా 18నెలల పాటు ఎగుమతులు కిందకు పడిపోతూనే వచ్చాయి. కేవలం జూన్ నెలలోనే పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, మళ్లీ జూలైలో నెగిటివ్ జోన్లోకి ప్రవేశించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement