హైదరాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎల్బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చైతన్యపురి పోలీసు స్టేషన్ల పరిధిలో గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అదేవిధంగా షాపింగ్ మాల్స్, స్కూళ్లపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.