Fab India
-
ఫ్యాబ్ ఇండియా బంపరాఫర్..వారికి 7 లక్షల షేర్లు ఉచితం..!
న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్ రిటైల్ దుకాణాల సంస్థ ‘ఫ్యాబ్ ఇండియా’ కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వనుంది. త్వరలో ఈ సంస్థ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను చేపట్టనుంది. దీంతో 7 లక్షల షేర్లను కళాకారులకు (చేతి వృత్తుల వారు), రైతులకు ఉచితంగా ఇవ్వాల ని నిర్ణయించింది. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) ఈ సంస్థ సెబీ వద్ద శనివారం దాఖలు చేసింది. రూ.500 కోట్ల తాజా ఇష్యూతోపాటు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్/ప్రస్తుత వాటాదారులు) రూపంలో 2,50,50,543 షేర్లను విక్రయించనుంది. ‘‘కంపెనీ, కంపెనీ అనుబంధ సంస్థలతో అనుబంధం కలిగిన కళాకారులు, రైతులను గౌరవించడంతోపాటు, వారికి ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్ ఇండియా ప్రమోటర్లు బిమ్లానంద బిస్సెల్ 4,00,000 షేర్లు, మధుకర్ ఖేరా 3,75,080 షేర్లను కళాకారులకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు తర్వాత బదిలీ చేయనున్నారు’’ అంటూ కంపెనీ ప్రకటించింది. -
ఫ్యాబ్ ఇండియాకు షాక్: భారీ నష్టపరిహారం డిమాండ్
సాక్షి, ముంబై: పాపులర్ రీటైల్ చైన్ నకిలీ ఖాదీ దుస్తులను అమ్ముతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలను బలాన్నిస్తున్నాయి. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవీఐసీ) ఫ్యాబ్ ఇండియాకు ట్రేమ్ మార్క్ వివాదం కింద నోటీసులు పంపించింది. ఫ్యాబ్ ఇండియా రీటైల్ ఔట్లెట్లలో అనుమతి లేకుండా తమ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించి వందలకోట్లు దండుకుందని ఆరోపించింది. ఇందుకుగాను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. చేనేత వస్త్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందంటూ మండిపడిన సంస్థ సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఖాదీ మార్క్ ట్యాగ్ కింద నకిలీ ఖాదీ వస్త్రాలను (కర్మాగారంలో తయారైన పత్తి వస్త్రాలను)విక్రయిస్తోందనీ, తద్వారా ఖాదీ ప్రతిష్టకు తీవ్ర నష్టంతోపాటు కూడా రా వినియోగదారులను తప్పుదారి పట్టిసతోందని తన నోటీసులో పేర్కొంది. తన చట్టబద్ధమైన "చర్ఖా" ను అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖాదీ ట్యాగ్ తో దుస్తుల అక్రమ విక్రయాలు చేపట్టిందని కమిషన్ ఆరోపించింది. ఇందుకుగాను నష్టపరిహారంగా రూ. 525 కోట్లను చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా హెచ్చరించింది. అయితే కేవీఐసీ, ఫ్యాబ్ ఇండియా మధ్య ట్రేడ్ మార్క వివాదం ఇప్పటిదికాదు. గతంలోనే కేవీఐసీ ఫ్యాబ్ ఇండియాకు నోటీసులు పంపించింది. 2015 ఆగస్టులో అక్రమ, అనధికారిక ఖాదీ మార్క్ వస్త్రాల విక్రయాలను నిలిపివేయాలని కోరింది. అలాగే వార్తాపత్రిల్లో తప్పుదారి పట్టించే ప్రకటనలు కూడా ఆపేయాలని కూడా హెచ్చరించింది. దీనికి ఫ్యాబ్ ఇండియా సానుకూలంగా స్పందించింది. అయితే మళ్లీ 2017, జనవరి లో ఫ్యాబ్ ఇండియా మళ్లీ రీతిలో వ్యవహరిస్తుండటంతో షాక్ అయిన కేవీఐసీ మరోసారి నోటీసులిచ్చింది. వీటికి స్పందించిన ఫ్యాబ్ ఇండియా కమిషన్ ప్రతినిధులతో చర్చలను కోరుతూ గతేడాది ఫిబ్రవరి 10న సమాధానం చెప్పింది. అయితే తాజాగా ఈ ఆరోపణలను మాత్రం అవాస్తవాలు, నిరాధారాలంటూ ఫ్యాబ్ ఇండియా ప్రతినిధి తిరస్కరించారు. తాము కేవీఐసీ చట్ట అతిక్రమణలకు పాల్పడటం లేదనే విషయాన్ని గత కొన్నాళ్లుగా పదే పదే సంస్థ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. చట్టపరమైన చర్యలకు దిగితే.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం విశేషం. -
ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ
గోవా: గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్ లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎదురైన చేదు అనుభవం ఘటనకు సంబంధించి ఆ షోరూమ్ ఎండీ, సీఈవోలకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై స్మృతీ ఇరానీ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా ఆ షోరూమ్ కు సమన్లు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా మరో ఏడుగురి ఉద్యోగులపై కూడా సమన్లు అందాయి. త్వరలో వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. అంతకుముందు ఈ కేసులో అరెస్టయిన నలుగురికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
‘కెమెరా’ వివాదం ఎందుకు చల్లారింది?
స్మృతి వ్యవహారంలో బీజేపీ కావాలనే అంటీముట్టనట్టు వ్యవహరించిందా పణజి: గుడ్‌ఫ్రైడే రోజు దేశం దృష్టిని ఆకర్షించిన ఆ వివాదం ‘ఈస్టర్ సండే’కల్లా ఎందుకు చప్పున చల్లారింది? గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రయల్ రూంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రహస్య కెమెరాను గుర్తించడంతో రోజంతా దానిపైనే తీవ్ర చర్చ జరిగింది. ప్రసార సాధనాలు దీనికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చాయి. కానీ సొంత ఎంపీ, కేంద్రమంత్రికి ఈ చేదు అనుభవం ఎదురవడంపై బీజేపీ నాయకత్వం పెద్దగా స్పందించలేదు. ఈ వ్యవహారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. అదే రోజు (శుక్రవారం) బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవడం ఇందుకు కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. సమావేశాలకు మీడియాలో దక్కాల్సిన ప్రాధాన్యాన్ని ఈ ‘కెమెరా’ వివాదం లాగేసుకుంటుందని భావించిన బీజేపీ.. కావాలనే దీనిపై అంతగా స్పందించలేదన్నది ఆ కథనాల సారాంశం. వాస్తవానికి శుక్రవారం స్మృతి ఇరానీ కండోలిమ్‌లోని ఫ్యాబ్ ఇండియాలో కెమెరాను గుర్తించగానే పోలీసులొచ్చి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. షాపును సీజ్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామంటూ గోవా సీఎం పార్సేకర్ దర్యాప్తునకు ఆదేశించారు. తెల్లారేసరికి సీన్ మారింది! కెమెరాల ఉదంతం వెలుగులోకి వచ్చిన తెల్లారే సీన్ మారింది. బీజేపీ సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం తగ్గిపోతుందని బీజేపీ నేతలు ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిదని భావించారు. సీఎం పార్సేకర్ గొంతు సవరించుకున్నారు. ‘‘ రూంలోకి స్మృతి కంటే ముందు కొందరు మహిళలు వెళ్లారు. కావాలని కెమెరాలు పెట్టినట్టు లేదు. అనుకోకుండా అలా జరిగి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. గోవా పేరును చెడగొట్టవద్దంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత సీన్లోకి బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి వచ్చారు. ఈ ఘటనలో బీజేపీ వైఖరిని ఆమె పరోక్షంగా బయటపెట్టారు. ‘‘పనికిరాని అంశాలను ముందుకు తీసుకువచ్చి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా..’’ అని ఆమె ట్వీటర్లో పేర్కొన్నారు. గోవాలోనూ గప్‌చుప్.. అదే రోజు గోవాలో కూడా ఈ ఘటన ప్రాధాన్యాన్ని తగ్గించి వేసే పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల పూచీకత్తుతో వారికి బెయిలిచ్చింది. స్మృతి ఇరానీకి ఫ్యాబ్ ఇండియా క్షమాపణలు తెలిపింది. గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దుకాణంపై సానుకూలంగా స్పందించారు. షాపు ప్రతినిధులు తమకు సహకరిస్తున్నారని, తమ ముందు హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారని ప్రకటించారు. అలా వివాదం శనివారం కల్లా కోమాలోకి వెళ్లిపోయింది! -
‘కెమెరా’ నిందితులకు బెయిల్
పణజి: గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో రహస్య కెమెరాల కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఇక్కడి స్థానిక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సరైన కారణాలు చూపనందున వారికి బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. శుక్రవారం ఈ షాపులో వస్త్రాలు మార్చుకునే ట్రయల్ రూంలో రహస్య కెమెరా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించడం, ఆ వెంటనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై పోలీసులు నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేయడం తెలిసిందే. వారిపై ఐపీసీ 354సి (రహస్యంగా చూడడం), 509(వ్యక్తిగత విషయాల్లోకి చొరబడడం)తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఇ కింద కేసులు పెట్టారు. పరారీలో ఉన్న షాపు మేనేజర్ చైత్రాలి సావంతాస్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా లాయర్ ద్వారా గోవా కోర్టును ఆశ్రయించారు. రహస్య కెమెరాలు లేవు: ఫ్యాబ్ ఇండియా స్మృతి ఇరానీ వెళ్లిన షాపు సహా తమ దుకాణాల్లో ఎక్కడా రహస్య కెమెరాలు లేవని ఫ్యాబ్ ఇండియా పేర్కొంది. మంత్రి గుర్తించిన కెమెరా నిఘా కెమెరానే కానీ రహస్య కెమెరా కాదని తెలిపింది. తమకు మహిళ పట్ల అపార గౌరవం ఉందని, మంత్రి ఇబ్బందికి గురైనట్లయితే క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో మరో కేసు.. మహారాష్ట్రలో కొల్హాపూర్‌లోని ఫ్యాబ్ఇండియా షాపులో మార్చి 31న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళ దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాలో చిత్రీకరించేందుకు షాపులో పనిచేసే ఇస్పుర్లే అనే వ్యక్తి యత్నించాడని తెలిపారు. ఈ విషయాన్ని సదరు మహిళ ఆమె గుర్తించి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.