వాడిపోయిన మెుక్కలు ఇస్తారా ?
కొడకండ్ల : హరితహారం కార్యక్రమంలో భాగం గా డ్వాక్రా సంఘాల మహిళలకు పంపిణీ చేసేం దుకై వచ్చిన దానిమ్మ మొక్కలన్నీ వాడిపోయి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావం నెలకొని వానలు కురువకపోవడంతో నాటిన మొక్కలే ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాడిపోయిన మొక్కలనునాటడం వలనఎలా బతుకుతాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ వద్ద మొక్కలను పంపిణీ చేస్తామని పంచాయతీ ఆధ్వర్యంలో చాటింపు వేయగా మొక్కల కోసం వచ్చిన వారు వాడిపోయిన మొ క్కలను చూసి విస్తుపోయారు. చనిపోయే దశ లో ఉన్న ఈ దానిమ్మ మొక్కలను తీసుకెళ్లేందు కు చాలా మంది నిరాసక్తత వ్యక్తం చేసారు.