విఫల ప్రేమికుడు రైలు ఆపేశాడు
తనకు దూరమైన ప్రేమికురాలిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు ఆ యూత్. అందుకో ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ పుణ్యమా అని ఏకంగా ఒక రైలే ఆగిపోయింది.
అబ్దుల్లా దేశ్ ముఖ్ గల్ఫ్ లో పనిచేస్తున్నాడు. ఆయనకి ముంబాయిలో ఉన్న ఒక అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. ఈ మధ్యే ఆ లవ్ కాస్తా బెడిసి కొట్టింది. దాంతో ఆమె మహారాష్ట్ర లోని దివా-సావంత్ వాడీ పాసెంజర్ రైల్లో ప్రయాణం చేస్తూండగా టైమ్ చూసి పోలీసులకు ఫోన్ చేసి ఆమె వద్ద బాంబు ఉందని చెప్పాడు.
దాంతో పోలీసులు హడావిడి పడిపోయారు. బాండ్ స్క్వాడ్ పరుగులు తీస్తూ వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరికి బాంబేమీ లేదని తెలిసింది. అసలు సంగతేమిటని ఆరా తీస్తే గల్ఫ్ ప్రేమికుడి కథ బయటపడింది. అబ్దుల్లా దేశ్ ముఖ్ ఈ మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ కి ఉద్యోగం కోసం వెళ్లాడు. ఆయన ఆ అమ్మాయి పట్ల పగతోనే ఇదంతా చేశాడని తేలింది. ఇప్పుడు అబ్దుల్లా పై చర్యలకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.