'సినిమా పరాజయానికి దర్శకుడిదే బాధ్యత'
ముంబై: సినిమా పరాజయానికి దర్శకుడిదే బాధ్యతని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. ప్రాజెక్ట్ చేయాలా వద్దా అని నిర్ణయించే అధికారం దర్శకుడికి మాత్రమే ఉంటుందని చెప్పారు.
'సినిమా విజయవంతమైతే ఆ ఘనత యూనిట్ మొత్తానికి చెందుతుంది. అదే సినిమా ఫెయిలయితే దర్శకుడిదే బాధ్యత' అని అనురాగ్ కశ్యప్ అన్నారు. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2015 ప్రివ్యూకు హాజరైన కశ్యప్ మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాజెక్ట్ అయినా నచ్చనపుడు దాన్ని తిరస్కరించకుంటే దర్శకుడు విఫలమైనట్టేనని చెప్పారు. ఏ చిత్రాన్నయినా తీయాలా వద్దా అనే విషయాన్ని తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. కశ్యప్ ఇటీవల బాంబే వెల్వెట్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రాలు తీశారు.