Fair accident
-
పొలాల్లో చెలరేగిన మంటలు
నిజాంసాగర్(జుక్కల్) : పంట పొలాల్లో చెలరేగిన మంటలు రైతులకు ముచ్చెమటలు పట్టించాయి. శుక్రవారం మధ్యాహ్నం నిజాంసాగర్ మండలం నర్వ, అన్నసాగర్ గ్రామ శివారులో పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. యాసంగి పంట నూర్పిడి చేసిన పొలాల్లో చెలరేగిన అగ్ని కీలలు.. కల్లాల్లో, కొయ్యకాల్లో నిల్వ ఉన్న ఎండుగడ్డికి వ్యాపించాయి. సుమారు 50 ఎకరాల మేర వ్యాపించిన మంటలు.. నర్వ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామ శివారులో వరి పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టారు. దూర ప్రాంతాల నుంచి తగలబడుకుంటూ వచ్చిన మంటలు ధాన్యం కుప్పలకు వద్దకు రావడంతో స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మంటలను ఆర్పేడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో విపరీతమైన గాలులు వీయడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో స్థానికులు ఎల్లారెడ్డి అగ్నిమాపక శకటానికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు మూడు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్‌సిబ్బంది వేగంగా స్పందించడంతో ధాన్యం కుప్పలకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. సుమారు రూ.10 లక్షల విలువైన ధాన్యాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. దీంతో ఇన్చార్జి ఫైర్ అధికారి గంగాధర్, పైర్మెన్లు సంతోష్‌కుమార్, అబ్దుల్ సలాం, శ్రీకాంత్‌లను సర్పంచ్ గొట్టం అనుసూజ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్ స్థానికులు అభినందించారు. -
జిన్నింగ్ మిల్లు గోదాంలో అగ్నిప్రమాదం
తల్లాడ, న్యూస్‌లైన్: భారీ అగ్నిప్రమాదం నుంచి 120మంది కూలీలు త్రుటిలో తప్పించుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తత వీరి ప్రాణాలను నిలబెట్టింది. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం ఇండస్ట్రియల్ పార్కులో నూతనంగా నిర్మించిన జిన్నింగ్ మిల్లు పత్తి గోదాంలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం కలవరం రేపింది. 2013 నవంబర్ నెలలో ఈ జిన్నింగ్ మిల్లును ప్రారంభించారు. మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించగా... అక్కడే ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లంకి నరసింహారావు కేకలు వేసి హెచ్చరించాడు. దీంతో అక్కడ పని చేస్తున్న 120 మంది కూలీలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. మంటలు గోదాంలో వ్యాపించేలోగానే వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాదంలో రూ.50లక్షల విలువచేసే పత్తి దగ్ధమయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే లోపల ఉన్న ట్రాక్టర్‌ను వెలుపలికి తీసుకువచ్చారు. ముందస్తు చర్యలు చేపట్టని యాజమాన్యం.. పత్తి నిల్వ చేసే గోదాంలో ప్రమాదాల నివారణకు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మంటలు ఆర్పివేసేందుకు నీటిని నిల్వ చేయలేదు. షార్ట్ సర్క్యూట్, మంటల కారణంగా ఉన్న ఒక్క బోరుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో మంటలు ఆర్పివేసేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సమీపంలోని బావులు, బోర్ల నుంచి నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పివేసేందుకు యత్నించారు. అలాగే మిల్లు వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ కంట్రోల్ సిస్టమ్ పట్ల సిబ్బందికి అవగాహన కూడా కల్పించలేదు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక సిబ్బంది, కూలీలు పరుగులు తీశారు. పెద్ద శబ్దం వచ్చింది విద్యుత్ షార్ట్ సర్య్కూట్ జరిగిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ప్రమాదం జరిగిందనే విషయం గమనించి కూలీలను బయటకు వెళ్లాలని సూచించాను. దీంతో కూలీలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. - ఎల్లంకి నరసింహారావు, ట్రాక్టర్ డ్రైవర్ బతికి బయటపడ్డాం పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాం. మేం బయటకు వచ్చిన వెంటనే మంటలు వ్యాపించాయి. బతుకుదెరువు కోసం వచ్చిన మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు. - తంబళ్ల రాణి,కూలీ భయంతో వణికి పోయాం విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి మంటలు వ్యాపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగు తీశాం. పత్తి రెల్లుతుండగా పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ఎం జరిగిందో తెలియక అయోమయం నెలకొంది. - అరుణ,కూలీ -
ముంబై ఫిల్మ్‌సిటీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి ముంబై: గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక దళానికి చెందిన ఐదు వాహనాలు, ఐదు నీటి ట్యాంకర్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కలర్స్ టీవీ చానల్లో ప్రసారమవుతున్న కామెడీ నైట్ విత్ కపిల్ ధారావాహిక ఎందరినో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే ఉదయం సుమారు 8.15 గంటలకు ఈ ధారావాహిక కోసం చిత్రీకరణ ప్రారంభమవుతుం డగా స్టేజీ వెనక భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఈ స్టూడియోలో అనేక షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇందుకోసం ఏర్పాటుచేసే భారీ సెట్లకు ఎక్కువ శాతం కట్టెలు, చెక్కలనే వినియోగిస్తారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కలున్న సెట్లను ముందుజాగ్రత్తగా తొలగించారు. అయితే ఈ ప్రమాదానికి కారణంతోపాటు నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.