fake CBI officers
-
CBI ముసుగులో రైడ్ కు వచ్చిన దొంగలు
-
సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భవానిపుర్‌లో ఓ ముఠా సినీ ఫక్కీలో చోరీకి పాల్పడింది. సీబీఐ అధికారులమని చెప్పి ఓ వ్యాపారవేత్త ఇంటిపై రైడ్ చేసింది. ఇల్లంతా సోదాలు చేసి రూ.30 లక్షల నగదు, ఆభరణాలు దోచుకెళ్లింది. 7-8 మంది పురుషులు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నకిలీ సీబీఐ అధికారుల చేతిలో మోసపోయి ఈ వ్యాపారవేత్త పేరు సురేష్ వాధ్వా(60). ఏడెనిమిది మంది మూడు కార్లలో సోమవారం ఉదయం 8గం.లకు తన ఇంటికి వచ్చారని చెప్పాడు. వాళ్ల వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు ఉన్నాయని పేర్కొన్నాడు. సీబీఐ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, ఐడీ కార్డు అడిగినా చూపించలేదని వివరించాడు. ఈ గ్యాంగ్ ఇల్లంతా సోదాలు చేసి రూ.30లక్షల నగదు, కొన్ని లక్షల విలువైన బంగారాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారని సురేష్ తెలిపాడు. ఏమేం సీజ్ చేశారనే లిస్ట్‌తో పాటు, విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా తర్వాత పంపిస్తామని చెప్పి ఆ ముఠా వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. తాను మోసపోయానని తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ దోపిడీలో సురేశ్ సన్నిహితులు లేదా అతనికి బాగా తెలిసిన వాళ్ల ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలించి ఆ మూడు కార్ల వివరాలు తెసుసుకుని నిందితుల కోసం గాలిస్తామన్నారు. చదవండి: షాకింగ్.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించిన బాలుడు -
‘గ్యాంగ్’ సినిమా చూపించారు.. ఇన్నోవా కార్లలో వచ్చి..
కోలారు(కర్ణాటక): కోలారు జిల్లా కేంద్రం భైరేగౌడ నగర్ ఐటీ, సీబీఐ అధికారులమం టూ చొరబడిన దుండగులు గ్యాంగ్ సినిమా తరహాలో భారీగా దోచుకుని పరారయ్యారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు ఇన్నోవా కార్లలో ఐదుగురు వ్యక్తులు ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రమేష్ ఇంటికొచ్చారు. ఐటీ, సీబీఐ అధికారులమని, తలు పులు తెరవాలన్నారు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి తలుపులు తీయడంతో ఇంట్లోకి వెళ్లిన వెంటనే రమేష్, కుటుంబ సభ్యులను పిస్టల్‌తో బెదిరించి వారి నోట్లో గుడ్డలు కుక్కి తాళ్లతో కట్టి వేశారు. ఇంట్లో ఉన్న రూ.25 లక్షలు, కిలో బంగారం, కొంత వెండి సామగ్రిని దోచుకున్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను తీసుకుని కార్లలో పరారయ్యారు. కొంతసేపటికి రమేష్ దంపతులు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వా రు వచ్చి కట్లు విప్పారు. వెంటనే కోలారు నగ ర పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ దేవరాజ్ విచారణ జరిపారు. పోలీసు జాగిలాలు, వేలిముద్రల నిపుణులతో ఆధారాలను సేకరించారు. దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడినట్లు బాధితులు తెలిపారు. -
సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా
సాక్షి, హైదరాబాద్: సీబీఐ అధికారులమంటూ 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయిన సంఘటన అమీర్‌పేటలో చోటు చేసుకుంది. వివరాలు.. జగదీష్ అనే జ్యోతిష్యుడు అమీర్‌పేట అన్నపూర్ణ బ్లాక్‌లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ జగదీష్ కార్యాలయంలో ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు జరిపి 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న జగదీష్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
నకిలీ సీబీఐ అధికారుల హల్చల్ ...
శుక్రవారం ఉదయం 7.30 గంటలు.. సీతమ్మధార కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లోనూ, బాలయ్యశాస్త్రి లేఔట్‌లోనూ రెండు ఇళ్లపై సీబీఐ దాడులు జరిగాయి. ఇద్దరు యువకులు వచ్చి తాము సీబీఐ అధికారులమని చెప్పుకున్నారు.. కుటుంబ సభ్యులందరి వద్ద నుంచి ఫోన్లు లాక్కున్నారు. వారందరినీ ఒక రూములోకి పంపించి దాదాపు నిర్బంధించినంత పని చేశారు. ఎవరైనా కదిలినా, వేరే వాళ్లకు సమాచారం అందించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాము సీబీఐ అధికారులమనీ, తమకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించేందుకు సహకరించాలన్నారు. ఐడీకార్డు చూపించమని అడిగితే.. పాన్ కార్డు చూపించి.. తనిఖీలకు వచ్చినప్పుడు ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేదని దబాయించారు. దీంతో.. ఇళ్లలోనివారు సైలెంట్ అయిపోయారు. వచ్చినవారు ఇళ్లలోని అణువణువూ జల్లెడ పట్టారు. ప్రతి అంగుళం సోదా చేసి.. మీ ఇంట్లో ఏమీ దొరకలేదంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు.. ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించారు. తీరా చూస్తే.. వారంతా నకిలీ సీబీఐ అధికారులని తేలింది. వారికి ఓ ఆర్ఎస్ఐ సహకరించినట్లు పోలీసుల చేతికి చిక్కిన సీసీటీవీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో నకిలీ ఏసీబీ అధికారులు దాడులు చేసిన వైనం మరవకముందే.. సీబీఐ అధికారులమంటూ దుండగులు చేసిన తాజా హడావుడి కలకలం సృష్టిస్తోంది. విశాఖసిటీ, విశాఖ క్రైం: నగరంలోని సీతమ్మధార రైతుబజార్ ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్ సీ బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో నివాసముంటున్న దాట్ల వెంకట సూర్యనారాయణేశ్వర జోగి జగన్నాధరాజు ఓ సివిల్ ఇంజినీరింగ్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 7.30 గంటలకు జగన్నాథరాజు పేపర్ చదువుతుండగా ఇద్దరు అపరిచిత యువకులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి సీబీఐ అధికారులమంటూ హల్చల్ చేశారు. ఇంట్లో వారందరినీ.. ఓ గదిలోకి తీసుకెళ్లి ఉంచారు. ఓ గదిలో అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాథరాజు తల్లి ఉన్నారు. ఆమె వద్దకు వెళతామని చెప్పినా వారు అంగీకరించలేదు. దాదాపు గంట సేపు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అన్ని గదుల్లో ఉన్న సూట్‌కేసులు, అల్మరాలు మొత్తం సోదాలు చేసి సామాన్లు చిందరవందరగా పడేసి ఏమీ దొరకలేదని వెళ్లిపోయారు. కిందికి వచ్చి చూడగా.. పోలీస్ అని రాసి ఉన్న ఏపీ35డీడీ1533 నంబర్ గల కారులో వెళ్లిపోతూ కనిపించారు. ఈ హఠాత్పరిణామంతో జగన్నాథరాజు తల్లి మరింత అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును ఆశ్రయించగా శుక్రవారం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టగా.. కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో అమర్చి ఉన్న సీసీటీవీల్లో నకిలీ సీబీఐ అధికారుల కదలికలు కనిపించాయి. వారికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వీరితో పాటు వచ్చిన పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఓ రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్గా పోలీసులు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని ద్వారకానగర్ పోలీసులు విచారించగా.. తన స్నేహితుడు తనతో పాటు రమ్మని కేఎస్ఆర్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారని, పైన ఏం జరిగిందనేది తనకు తెలీదని ఆయన చెప్పినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ద్వారకానగర్ సీఐ రాంబాబు తెలిపారు. గంట తర్వాత మరోచోట కాగా అక్కడికి గంట తర్వాత బాలయ్యశాస్త్రి లే అవుట్‌లోనూ ఇదే మాదిరిగా అపరిచితులు సోదాల పేరుతో హల్చల్ చేశారు. గీతికా అపార్ట్మెంట్లో నివాసముంటున్న పేరిచర్ల ప్రసాదరాజు ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ వెళ్లి సోదాలు నిర్వహించారు. దాదాపు గంట పాటు సోదాలు చేసిన అనంతరం.. పొరపాటున వచ్చామంటూ వేగంగా వెళ్లిపోయారనీ.. బాధితుడు ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు.రెండు నెలల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ కొంతమంది వ్యక్తులు దాడులు నిర్వహించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో మరోసారి నగరంలో నకిలీ సీబీఐ దాడులు అలజడి రేపుతున్నాయి. -
సీబీఐ అధికారులమంటూ మోసం
హైదరాబాద్: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సహకరించిన ముగ్గురిని సంతోష్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ వి. శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ ఎం. శంకర్‌తో తెలిపిన వివరాలివి... కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన హులిరాజ్ గౌడ్ ఆలియాస్ అలీ ఆలియాస్ సికిందర్ అలీ (51) నగరంలో సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతడు అంబర్పేట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన సయ్యద్ మస్తాన్ అలీ (45), యాకుత్‌పురాకు చెందిన సయ్యద్ మసూద్ అలీ హష్మీ ఆలియాస్ నవాజ్ (26), నర్కీ పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా పాషా ఆలియాస్ బాబా (46)లతో కలిసి భూకబ్జాలు, వివాదాలు, ఇతర సెటిల్మెంట్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా సంతోష్‌నగర్ రాజనర్సింహానగర్ కాలనీకి చెందిన సయ్యద్ నజఫ్ మోహీనుద్దీన్ ఆలియాస్ సైఫుద్దీన్ (82)కు బాలాపూర్ ప్రాంతంలో ఇంటి స్థలం ఉంది. కాగా, ఈ ప్లాట్ గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సికిందర్ అలీ తాను సీబీఐ డిప్యూటీ డెరైక్టర్ అంటూ ఢిల్లీ నుంచి వచ్చానని సైఫుద్దీన్‌ను బుట్టలో వేసుకునానడు. వివాదాన్ని పరిష్కరించేందుకంటూ అతని నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. అయితే, సమస్యను పరిష్కరించకుండా నాన్చుతున్నాడు. ఇదేమనిప్రశ్నిస్తే అసభ్యంగా మాట్లాడాడు. దీంతో బాధితుడు సైపుద్దీన్ సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు నయాపూల్‌లో ఉన్నట్లు సమాచారం అందుకుని శుక్రవారం రాత్రి దాడి చేశారు. నకిలీ అధికారిగా చెలామణి అవుతున్న సికిందర్ అలీ సహా నలుగురినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు. -
ముగ్గురు నకిలీ సీబీఐ అధికారుల అరెస్టు
ఢిల్లీ: సీబీఐ అధికారలమంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ఘటనలు రోజూ ఏదో మూల చోటు చేసుకుంటునే ఉన్నాయి. డబ్బును సులభ మార్గంలో సంపాదించేందుకు ' సీబీఐ' వేషాలు వేసుకుని సామాన్యులను మోసం చేస్తున్నవ్యక్తులను అరెస్టు చేసిన ఘటన తాజాగా మరోటి వెలుగు చూసింది. అమిత్ ఆగర్వాల్(అలియాస్ గోల్డీ) మరో ముగ్గురు వ్యక్తులు కలిసి తమను సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్న గోల్డీ సెటిల్ మెంట్ చేస్తామంటూ నమ్మబలికాడు. అతనికి పుతిన్ కటారియా, మహేందర్ సింగ్, దిలీప్ కుమార్ జత కలవడంతో వారి మోసాలకు అద్దు అదుపు లేకుండా సాగిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న నగర క్రైం బ్రాంచి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కమీషన్ రవీందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...స్థిరాస్తుల వివాదాన్ని సెటిల్ చేసేందుకు సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా గొంతు మార్చి మాట్లాడిన ప్రధాన నిందితుడు అమిత్ ఆగర్వాల్‌కు సహకరించిన ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఓప్రైవేట్ కంపెనీకి ఎగుమతుల లెసైన్స్ రెన్యూవల్ చేయాలని విదేశీ వ్యాపార అదనపు జనరల్ డెరైక్టర్‌గా కూడా అమిత్ మాట్లాడని పోలీసులు తెలిపారు. ఇతనికి నకిలీ సిమ్ కార్డు సమకూర్చేందుకు పునిత్ కటారియా, దిలీప్ కుమార్, మహేందర్ సింగ్ సహకరించారని చెప్పారు. అమిత్ కలిసి పునీత్ నకిలీ గుర్తింపుపై సిమ్ కార్డును పొందారని చెప్పారు. వీరికి మొబైల్ దుకాణ యజమాని మహేందర్ సహకరించాడని తెలిపారు.