ఢిల్లీ: సీబీఐ అధికారలమంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ఘటనలు రోజూ ఏదో మూల చోటు చేసుకుంటునే ఉన్నాయి. డబ్బును సులభ మార్గంలో సంపాదించేందుకు ' సీబీఐ' వేషాలు వేసుకుని సామాన్యులను మోసం చేస్తున్నవ్యక్తులను అరెస్టు చేసిన ఘటన తాజాగా మరోటి వెలుగు చూసింది. అమిత్ ఆగర్వాల్(అలియాస్ గోల్డీ) మరో ముగ్గురు వ్యక్తులు కలిసి తమను సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్న గోల్డీ సెటిల్ మెంట్ చేస్తామంటూ నమ్మబలికాడు. అతనికి పుతిన్ కటారియా, మహేందర్ సింగ్, దిలీప్ కుమార్ జత కలవడంతో వారి మోసాలకు అద్దు అదుపు లేకుండా సాగిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న నగర క్రైం బ్రాంచి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీస్ కమీషన్ రవీందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...స్థిరాస్తుల వివాదాన్ని సెటిల్ చేసేందుకు సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా గొంతు మార్చి మాట్లాడిన ప్రధాన నిందితుడు అమిత్ ఆగర్వాల్‌కు సహకరించిన ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఓప్రైవేట్ కంపెనీకి ఎగుమతుల లెసైన్స్ రెన్యూవల్ చేయాలని విదేశీ వ్యాపార అదనపు జనరల్ డెరైక్టర్‌గా కూడా అమిత్ మాట్లాడని పోలీసులు తెలిపారు. ఇతనికి నకిలీ సిమ్ కార్డు సమకూర్చేందుకు పునిత్ కటారియా, దిలీప్ కుమార్, మహేందర్ సింగ్ సహకరించారని చెప్పారు. అమిత్ కలిసి పునీత్ నకిలీ గుర్తింపుపై సిమ్ కార్డును పొందారని చెప్పారు. వీరికి మొబైల్ దుకాణ యజమాని మహేందర్ సహకరించాడని తెలిపారు.