'అతనితో ఫాల్స్ రిలేషన్ వద్దనుకున్నా..'
ముంబై: 'చిన్నప్పటి నుంచే మేం బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేమించుకుని పెళ్లాడాం. పిల్లలు పుట్టిన కొన్నేళ్లకు నన్ను నేను తరచి చూసుకున్నా. అప్పటికే మా మధ్య అంతులేని అగాథం. మాట్లాడుకుంటాం, కలిసి భోజనం చేస్తాం.. అయినా ఏదో వెలితి. ఇంకొన్నాళ్లకు నాకు అనిపించింది..ఈ బూటక సంబంధం(ఫాల్స్ రిలేషన్ షిప్) అవసరమా! అని. తర్వాత ఇద్దరం మాట్లాడుకుని విడాకులు తీసుకున్నాం' అంటూ విడిపోయిన రెండేళ్ల తర్వాత హృతిక్ తో విడాకులపై పెదవి విప్పింది సుజానే ఖాన్.
విడాకులు పొందినా, ఇప్పటికీ తాము మాట్లాడుకుంటామని, పిల్లల విషయంలో నిర్ణయాలు కలిసే తీసుకుంటామని ప్రఖ్యాత ఫెమినా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజానే చెప్పారు. గత ఏడాది ముంబైలోని ఓ రెస్టారెంట్ లో హృతిక, సుజానేలు పిల్లలతోపాటు కనిపించారు. ఆ ఫొటోల ఆధారంగా 'వీళ్లు మళ్లీ కలిపోయారు' అంటూ ఓ వర్గం మీడియా వార్తలు ప్రసారం చేసింది. అయితే సుజానే మాత్రం తాము ఎప్పటికే కలవబోయేది లేదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని విజ్క్షప్తి చేశారు. ఇప్పుడు ఆమే స్వయంగా హృతిక్ తో విడిపోవటానికి గల కారణాలను వెల్లడించారు. కంగనా రనౌత్ తో వివాదం విషయంలోనూ హృతిక్ ను వెనకేసుకొచ్చిన సుజానే.. హృతిక్ మంచివాడని కితాబు ఇచ్చింది. భార్యా భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసే ఉన్నామని చెప్పింది.