సల్మాన్‌ఖాన్ కేసు పెట్టాడు
ముంబయి: తనపేరుపై తనకు, పలువురు ఫోన్లకు వచ్చిన ఒక ఫాల్స్ వాట్సాప్ పోస్ట్ విషయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆయన కేసు పెట్టారు. స్వయంగా ముంబయి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఎవరో వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి అందులో సల్మాన్ ఉద్దేశిస్తూ పోస్ట్ చేయగా అది పలుచోట్ల చక్కెర్లు కొడుతుంది.
ఆ ఫేక్ వాట్సాప్ పోస్ట్‌లో 'మీ ముస్లింల మద్ధతు లేకుండానే ఈసారి సినిమా విజయవంతం అవుతుందంటూ' చేర్చారు. దీంతో ఆయన ముంబయి క్రైం బ్రాంచ్ ను ఆశ్రయించారు. సల్మాన్ నటించిన కొత్త చిత్రం 'బజరంగీ భైజాన్' జూలై 17న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ ఆంజనేయుడి భక్తుడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లింల మద్ధతు అంటూ వచ్చిన ఫేక్ పోస్ట్ ఆయనను కలవర పెట్టడంతో పోలీసులను ఆశ్రయించారు.