family welfare surgery
-
లక్ష్యం.. ఛేదించలేకపోయారు...
ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేసి జనాభానియంత్రణకు తన వంతు ప్రయత్నంలో భాగంగా జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల్లో అవగాహన కల్గించివారే ఆపరేషన్లు చేయించుకునేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు కృషిచేయాల్సి ఉన్నప్పటికీ తమకు కేటాయించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. తమకు ఉన్న గడువులో లక్ష్యాన్ని సాధించడం అధికారులకు కష్టమే... ► సంక్షేమ శస్త్రచికిత్సల టార్గెట్ సాధించడంలో విఫలం ► 15 వేలకు కేవలం 8969మాత్రమే పూర్తిచేసిన అధికారులు విజయనగరంఫోర్ట్: కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స లక్ష్యం సాధించడానికి నిర్ధేశిత గడువు కేవలం 10 రోజులే ఉంది. అయితే సాధించాల్సిన లక్ష్యం మాత్రం వేలల్లో ఉంది. 11 నెలల్లో సాధించలేనిది కేవలం 10 రోజుల్లో సాధిస్తారనేది సందేహంగా నిలిచింది. 2016–17 సంవత్సరానికి వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమ లక్ష్యం 15వేలు ఇచ్చింది. అయితే ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 8969 చికిత్సలు చేశారు. ఇంకా 6031 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా కేవలం 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో లక్ష్యాన్ని సాధించడం అంత సులవు కాదు. జనాభా నియంత్రణకు అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని నెరవేర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాల్లో కుటుంబ సంక్షేమ చికిత్సల లక్ష్యాన్ని సాధించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. కాని అది అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో జిల్లా వెనుకపడడమే ఇందుకు నిదర్శనం. జిల్లా జనాభా ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనాభాను నియంత్రించడం చాలా అవసరం. కానీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. జనాభాను అరికట్టకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా స్థల సమస్య, నిరుద్యోగసమస్య, ఆహార సమస్య ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారమే కు.ని. చికిత్స. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సల లక్ష్యాన్ని సాధించడానికి కృషిచేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా వీటిని పూర్తి చేస్తాం. ఈ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. డాక్టర్ సి.పద్మజ, డీఎంహెచ్ఓ, విజయనగరం -
కుటుంబ సంక్షేమంలో విఫలం
విజయనగరంఫోర్ట్: జనాభా నియంత్రణలో అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని సాధించడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విఫలమవుతున్నారు.గడచిన ఐదేళ్లకాలంలో ఏ ఏడాది కూడా లక్ష్యాన్ని వందశాతం సాధించిన దాఖలాలు లేవు. ఏటికేడాది లక్ష్యం తగ్గుతున్నప్పటికీ వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. వేసెక్టమీ శస్త్రచికిత్సల సంగతి అరుుతే చెప్పనవసరం లేదు. ఏటా తగ్గుతున్న లక్ష్యం కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సల లక్ష్యం ఏటా తగ్గుతోంది-2012లో శస్త్రచికిత్సల లక్ష్యం 19 వేలు కాగా ఈఏడాది 15 వేలకు తగ్గింది. గత ఏడాది 15, 294 ఉంటే ఈఏడాది 15వేలకు తగ్గింది. ఇలా ఏటా ఏటా లక్ష్యం తగ్గింది. అరుునప్పటికీ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాల్లో కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని ఉన్నతాధికారులు పదే పదే చెప్పినప్పటికీ అచరణమాత్రం జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగశాఖకు 15,000 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని నిర్దేశించగా అధికారులు అక్టోబర్ నెలాఖరు నాటికి 5,069 శస్త్రచికిత్సలు చేశారు. లక్ష్య సాధనకు చర్యలు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 26 వతేదీనుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం శస్త్రచికిత్సలు చేసే డాక్టర్ ఒకరే ఉన్నారు. మరో ఇద్దరికి శిక్షణ ఇప్పిస్తున్నాం. సి.పద్మజ, డీఎంహెచ్ఓ, విజయనగరం వేసేక్టమీదీ అదే దారి పురుషలకు చేసే వేసెక్టమీ శస్త్రచికిత్సల లక్ష్య సాధనలోనూ వైద్యులు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2016-17 సంవత్సరానికి 1500 వేసేక్టమీ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉండగా అధికారులు కేవలం 52 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. దీనిని బట్టి వైద్యులు ఎంత అలసత్వం ప్రదర్శిస్తున్నారో అర్ధమవుతోంది. 2012 నుంచి 2016 అక్టోబర్ నెలాఖరు వరకు శస్త్రచికిత్సల వివరాలు సంవత్సరం లక్ష్యం సాధించింది 2012 19000 14846 2013 18000 17280 2014 18000 16560 2015 15294 13000 2016 15000 5069 అక్టోబర్వరకు