ఐ ఫోన్
దర్శకత్వం: వరప్రసాద్ వరికూటి
కథ: ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న వరప్రసాద్ వరికూటి ఈ లఘుచిత్రాన్ని ‘ఇండియన్ మైండ్స్ సినిమా’ బ్యానర్‌పై రూపొందించారు. ఇందులో ఒక సంపన్న యువకుడు పొగరుబోతుగా ప్రవర్తిస్తుంటాడు. పనిచేసే చోట చిన్న చిన్న విషయాలకే అందరిపై చిందులు వేస్తుంటాడు. ఒకరోజు అతడు తన ఐ ఫోన్ పోగొట్టుకుంటాడు. అతడి బాధితుడైన వురో యువకుడికి ఆ ఫోన్ దొరుకుతుంది. ఫోన్ దొరికిన కొద్ది నిమిషాల్లోనే, దానిలోని యాప్స్ సాయంతో అతడు తనను అనవసరంగా వేధించిన పొగరుబోతు యువకుడిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.