తీవ్రవాదులు కాల్పులు: 11 మంది పౌరులు హతం
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఫరాహ్ ప్రావెన్స్లో 11 మంది పౌరులపై తాలిబన్ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో పౌరులంతా మరణించారని ఫరాహ్ ప్రావెన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతి చెందిన పౌరులంతా ఇరాన్లో కార్మికులుగా పని చేసేందుకు వలస వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. వీరంతా పశ్చిమ ఫరాహ్ ప్రావెన్స్ వాసులని చెప్పారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.