ఎమ్మెల్యే రాజయ్య దీక్ష భగ్నం
భద్రాచలం, పోలవరం వుుంపు వుండలాల ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని డివూండ్ చేస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆవురణ దీక్షలను ఆదివారం పోలీసులు భగ్నం చేశారు. సున్నం రాజయ్యు నేతృత్వంలో ఆ పార్టీ నాయుకులు చేపట్టిన దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు సూచించటంతో దీక్ష విరమించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యే రాజయ్యతో పట్టణ సీఐ ఆంజనేయలు పలుమార్లు చర్చించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షలను విరమించేది లేదని రాజయ్య చెప్పడంతో సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం తర్వాత దీక్ష శిబిరానికి పోలీసులు చేరుకుని, దీక్ష చేస్తున్న అందరినీ బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీపీఎం నాయకులకు తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
బుధవారం ముంపు మండలాల బంద్
దీక్షలను పోలీసులు భగ్నం చేయడంపై సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం ముంపు మండలాల బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు అన్నిపార్టీలు, ప్రజా, ఆదివాసీ సంఘాలు సహకరించాలని కోరారు.