FastTrack courts
-
కోర్టుల్లో ఉద్యోగాలు 1,406
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను పర్మినెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులుగా, మరో 16ను సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా మార్చారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరింది. కాగా, మొత్తం 38 కోర్టులకు 1,098 పోస్టులను మంజూరు చేస్తూ సర్కార్ మరో జీవో జారీ చేసింది. ఇందులో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కేడర్ కోర్టుల్లో 682 పోస్టులు, 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులు మంజూరయ్యాయి. మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో 308 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. మరో 308 పోస్టులు.. రాష్ట్రంలోని 14 అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిల కోర్టుల్లో 14 కేటగిరీల్లో 308 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్టులను ఔట్ సోర్సింగ్‌లో తీసుకోనుండగా.. మిగతా 11 కేటగిరీల్లో రెగ్యులర్ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనున్నారు. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) పోస్టులు 14, హెడ్ క్లర్క్ 14, ట్రాన్స్‌లేటర్ 14, యూడీబీసీ 14, పర్సనల్ అసిస్టెంట్ 14, జూనియర్ అసిస్టెంట్ 42, టైపిస్ట్ 14, ఫీల్డ్ అసిస్టెంట్ 28, ఎగ్జామినర్ 14, కాపీయిస్ట్ 14, ప్రాసెస్ సర్వర్ 28, డ్రైవర్ 14, రికార్డు అసిస్టెంట్ 14, ఆఫీస్ సబార్డినేట్ 70 పోస్టులున్నాయి. -
మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు సోమవారం మహిళా భద్రత అంశంపై స్వల్పకాలిక చర్చను ఆమె ప్రారంభించారు. మహిళల రక్షణ, కిశోర బాలికలను చైతన్యపరిచి వారికి సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. 11,158 గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శులు, 3,809 వార్డు మహిళా సంరక్షక కార్యదర్శులు కలిపి మొత్తం 14,967 ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడానికి ‘మహిళా మిత్ర’ కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై నేరాల కేసులను, జీరో ఎఫ్ఐఆర్ను వెంటనే నమోదు చేసేలా పోలీసులకు సూచనలు ఇచ్చామని చెప్పారు. మహిళలపై నేరాల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు. 100, 112, 181 మహిళా హెల్ప్లైన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గృహ హింస నుంచి మహిళల సంరక్షణ, మహిళా శక్తి కేంద్రాలు, సమగ్ర శిశు సంరక్షణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది? కాగా, ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ ఉదయం 11.43 గంటలకు మొదలైంది. మహిళా భద్రత అంశంపై స్వల్ప వ్యవధి చర్చను హోం శాఖ మంత్రి సుచరిత మొదలుపెట్టగా.. విపక్ష సభ్యులు ఉల్లి ధరలపై చర్చను చేపట్టాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది?’ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చర్చకు సిద్ధమని ప్రకటించిన తర్వాత పోడియం వద్దకు వచ్చి ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా స్పీకర్ చైర్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అధికార పక్షానికి చెందిన మహిళా సభ్యులంతా పోడియం వద్దకు చేరుకుని మహిళా భద్రత అంశంపై చర్చను అడ్డుకోవడమేంటని నినాదాలు చేశారు. ‘మహిళా వ్యతిరేకి చంద్రబాబు.. రౌడీ ప్రతిపక్షం’ అంటూ అధికార పక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిరసన తెలిపారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200 అని.. చిత్తశుద్ధి ఉంటే ధర తగ్గించి విక్రయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పరిపాలనలో మహిళల్ని ఎలా వేధించారో బట్టబయలవుతుందనే భయంతో చర్చను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
కిడ్నాప్ కేసుల కథ కంచికేనా?
- ముందుకు కదలని మహిళల అపహరణ కేసులు - అధికశాతం కేసులు దర్యాప్తులోనే.. - అందుబాటులోకి రాని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీస్ శాఖ, వారిపై దాడులు, కిడ్నాపులకు సంబంధించిన కేసుల్లో మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోతోంది. మహిళలను కిడ్నాపు చేసిన కేసులు ఏళ్ల పాటు దర్యాప్తు దశలోనే ఉండిపోతున్నాయి. కేసుల దర్యాప్తు పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చిందన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడమే శిక్షల శాతం పెరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? అపహరణకు గురైన మహిళలను రక్షించడంలో 45శాతం సఫలమవుతున్న పోలీసులు ఆ మేరకు నిందితులకు శిక్షపడేలా చేయడంలో అలసత్వం వహిస్తున్నారని అపవాదు ఎదుర్కొంటున్నారు. సరైన ఆధారాలు సేకరించకపోవడం, మిగతా లింకును బయటపెట్టకపోవడంతో నిందితులు సులభంగా తప్పించుకోగులుగుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులేవీ?.. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించకపోవడం కూడా శిక్షల శాతం పెరగకపోవడంలో మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను తీసుకు రావాల్సిన పోలీస్ శాఖ అటువైపు ఆలోచించడం కూడా మానేసింది. 2014 నుంచి 2016 డిసెంబర్ వరకు మహిళల కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి దింపిన సంఘటనల్లో కేసులు 2,046 వీటిలో తప్పుడు కేసులనే కారణంతో మూసివేసినవి 472 దర్యాప్తునకు స్వీకరించిన కేసులు 1,574 కేవలం కిడ్నాపునకు సంబంధించి దర్యాప్తు దశలోనే ఉన్న కేసులు 493 కిడ్నాపు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డ కేసులు 6.5% -
ఆద్యంతం.. సంచలనం!
► స్నేక్ గ్యాంగ్ ఉదంతంపై రోజంతా ఉత్కంఠ ► కోర్టు తీర్పు నేపథ్యంలో చర్చోపచర్చలు ► ఫిర్యాదుదారుల ఇళ్ల వద్ద బందోబస్తు పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన స్నేక్ గ్యాంగ్ ఘటన ఆద్యంతం సంచలనమే అయింది. 2014 జూలై 31న ఘటన జరిగినప్పటి నుంచి మొదలుకొని బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో తీర్పు వెలువడే వరకు ఈ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదట నలుగురు నిందితుల అరెస్ట్....శ్రీశైలం పారిపోయిన ప్రధాన నిందితుల పట్టివేత....అనంతరం కోర్టు అనుమతితో నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. కాగా ఘటన జరిగిన అనంతరం స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న కారణంగా అప్పటి పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి, సెక్టార్ ఎస్సై వీరప్రసాద్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ ప్రేమ జంటను పాముతో బెదిరించి, యువతిని నిందితులు వివస్త్రను చేసి చిత్రీకరించిన వీడియోలు కొన్ని లోకల్ చానళ్లు, వాట్సాప్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇందుకు బాధ్యులైన కొంతమంది నెటిజన్లు కూడా అరెస్టయ్యారు. షాయిన్‌నగర్, ఎర్రకుంట ప్రాంతాలలో స్నేక్ గ్యాంగ్ ముఠా అరాచకాలు, రౌడీషీటర్లు, పహిల్వాన్ల దాదాగిరితో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కమిషనర్ సి.వి.ఆనంద్ కార్డన్‌సెర్చ్‌కు శ్రీకారం చుట్టారు. సైబరాబాద్ పరిధిలో ఏ కార్డన్‌సెర్చ్‌లో నేరుగా పాల్గొనని ఆయన... షాయిన్ నగర్లో స్వయంగా పాల్గొన్నారు. స్నేక్‌గ్యాంగ్‌లోని నిందితులందరి ఇళ్లకు వెళ్లిన కమిషనర్ వారు చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోలను తల్లిదండ్రులకు చూపించి...మీ పిల్లలు చేసిన పనిని సమర్ధిస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం స్నేక్‌గ్యాంగ్‌లోని నిందితులు ఒక్కొక్కరిపై పి.డి.యాక్ట్‌లు ప్రయోగిస్తూ వచ్చారు. అనంతరం పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేయడం, కోర్టులో ట్రయల్స్ జరిగిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియాలో కొనసాగింపుగా వచ్చాయి. ఇలా మొత్తం మీద రెండేళ్ల పాటు స్నేక్‌గ్యాంగ్ ఉదంతం ప్రజలలో చర్చనీయాంశమైంది. పహాడీషరీఫ్ పోస్టింగ్ అంటేనే బెదిరిపోయిన ఇన్స్పెక్టర్లు స్నేక్‌గ్యాంగ్ ఘటనతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్స్పెక్టర్గా రావాలంటేనే కొందరు అధికారులు బెదిరిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేసిన కమిషనర్.. ఆయన స్థానంలో కళింగరావును నియమిం చారు. కానీ ఆయన కనీసం చార్జికూడా తీసుకోలేదు. తర్వాత శ్రీధర్‌ను నియమిం చారు. ఆయన సైతం కేవలం 10-15 రోజులే కొనసాగి తన వల్ల కాదంటూ ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం సెప్టెం బర్ మాసంలో వచ్చిన ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు గట్టిగా నిలబడి కఠినంగా వ్యవహరించారు. 10 నెలల పాటు పని చేసిన ఆయన అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయగలిగారు. ఆయన అనంతరం వచ్చిన వి.వి.చలపతి ప్రస్తుత ఇన్స్పెక్టర్గా కొనసాగుతున్నారు. పోలీసుల ప్రత్యేక నిఘా. ప్రేమ జంటపై పాముతో బెదిరించి దాడి చేసిన స్నేక్‌గ్యాంగ్ నిందితులకు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్ష విధించడంతో కోర్టు వద్ద నిందితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పహాడీషరీఫ్ పోలీసులు స్థానికంగా ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆవేశంలో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు కేసుకు అనుకూలంగా వ్యవహరించిన వారిపై దాడి చేసే అవకాశం ఉందని భావించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుల ఇళ్ల వద్ద దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదట్లోనే అడ్డుకుంటే బాగుండేది... పాములతో బెదిరిస్తూ అరాచకాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ సభ్యులకు సరైన శిక్షే పడింది. ఇలాంటి వారిని జీవితాంతం జైల్లోనే ఉంచాలి. వీరి అరాచకాలకు మొదట్లోనే అడ్డుకట్ట వేస్తే ఎంతో మంది మహిళలు రక్షింపబడేవారు. చివరకు ఒక యువతి ధైర్యం చేయడంతో వీరి పాపం పండింది. -జి.ప్రజ్వల, కేశవగిరి కఠిన శిక్షలు పడితేనే నేరాలకు చెక్ స్నేక్ గ్యాంగ్’ వంటి ఘటనల్లో కఠిన శిక్షలు పడితేనే నేరాలను తగ్గించగలం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నేరబాట పట్టకుండా చూడాలి. మహిళలపై దాడులు, అరాచకాల కేసులను సత్వరమే విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. -నిమ్మల నరేందర్ గౌడ్, మామిడిపల్లి