fat in body
-
రక్తపోటు మందుతో దీర్ఘాయువు?
రక్తపోటు నివారణకు ఉపయోగించే మందు ఆయువును పెంచేం దుకు దోహదపడుతుందని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటోలజోన్ అనే ఈ మందును వాడినప్పుడు కణస్థాయిలో ఆయువును పెంచే ప్రక్రియలు జరుగుతాయని, ఏలిక పాములపై ఈ మందు ప్రయోగించామని, ఇవే ఫలితాలు మానవుల్లోనూ ఇస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైటోకాండ్రియా మన వయసు పెరిగే కొద్దీ సక్రమంగా పనిచేయదు. మైటోకాండ్రియాను మరమ్మతు చేసి ఆయువు పెంచేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే శరీర వ్యవస్థలో మరమ్మతు చేసేందుకు ఓ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియను మందుల ద్వారా ప్రారంభిస్తే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసి మనం ఎక్కువ కాలం సమస్యల్లేకుండా బతకొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏలికపాములపై జరిపిన పరిశోధనలకు ప్రాధాన్యమేర్పడింది. మైటోకాండ్రియా మరమ్మ తు ప్రక్రియ మొదలైనప్పుడు ఏలికపాము కాస్తా వెలుగులు చిమ్మేలా జన్యుమార్పులు చేసి.. పలు వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులను వాటిపై ప్రయోగించారు. మెటోలజోన్ అనే రక్తపోటు మందు వాడినప్పుడు ఏలికపాముల్లో మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైందని, వాటి జీవన కాలమూ పెరిగిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కేజ్ నకాడై తెలి పారు. మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియకు ఉపయోగపడే హెచ్ఎస్పీఏ–6 జన్యువు ఉత్తేజితం అవుతున్నట్లు తెలిసింది. చలిలో వ్యాయామం.. వేగంగా కరిగేను కొవ్వు! చలి ఎక్కువవుతున్న కొద్దీ మనలో చాలామంది దుప్పట్లు కప్పేసుకుంటాం. ఉదయా న్నే చేసే వ్యాయామానికి సెలవులు ప్రకటించుకుంటాం. కానీ చలి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతోంది కెనెడాలోని లారెన్షియన్ యూనివర్సిటీ పరిశోధన. మీరెప్పుడైనా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) గురించి తెలుసా..? వ్యాయామం చేసే తీరులో ఇదో పద్ధతి. కొన్ని నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం ఆ తర్వాత కొంత విరామం.. తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం ఇలా సాగుతుంది ఈ హెచ్ఐఐటీ. కొవ్వులను వేగంగా కరిగించేందుకు ఇది మేలైన వ్యాయామం అని ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాయామంపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏంటన్నది తెలుసుకునేందుకు లారెన్షియన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పరిసరాల ఉష్ణోగ్రత 21ల డిగ్రీ సెల్సియస్‌గా ఉన్నప్పుడు హెచ్ఐఐటీ చేస్తున్న వారితో పోలిస్తే సున్నా డిగ్రీ సెల్సియస్‌లో అంటే నీరు గడ్డకట్టే పరిస్థితుల్లో వ్యాయామం చేసే వారిలో కొవ్వులు ఆక్సీకరణం చెందే వేగం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీవక్రియల విషయంలోనూ చలి వాతావరణంలో చేపట్టిన హెచ్ఐఐటీ ప్రభావశీలంగా ఉందని, రక్తంలో చక్కెర మోతాదుల నియంత్రణకు, కొవ్వులు కరిగేందుకు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ తగ్గేందుకూ ఇది ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
‘కరోనా’తో కొవ్వుల వ్యవస్థ హైజాక్!
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్ మన కణాల్లో కొవ్వులను ప్రాసెస్ చేసే వ్యవస్థను దెబ్బ తీస్తుందని చైనాకు చెందిన అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా.. దీని వివరాలు నేచర్ మెటబాలిజం జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌తో కూడిన కణాలను పరిశోధనశాలలో వృద్ధి చేశారు. వీటిని పరిశీలించినప్పుడు శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్ కొవ్వులు అతుక్కునే భాగానికే వైరస్ కూడా అతుక్కున్నట్లు గుర్తించారు. ఆ భాగాన్ని తొలగించి పరిశీలిస్తే వైరస్ మానవ కణానికి అతుక్కోవడం నిలిచిపోయింది. ఈ అంశం ఆధారంగా వ్యాధి చికిత్సకు కొత్త మందులు తయారు చేయొచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి తాము ప్రాథమిక పరిశీలనలు మాత్రమే జరిపామని, ఇన్ఫెక్షన్ను ఎక్కువ చేసేందుకు వైరస్ కొలెస్ట్రాల్ జీర్ణ వ్యవస్థను వాడుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. అధిక ఫాస్ఫరస్ వినియోగానికి చెక్! హైదరాబాద్: చీడపీడల నుంచి రక్షణకు లేదా మొక్కలు ఏపుగా ఎదిగేందుకు చాలామంది రైతులు ఎరువులను విచ్చలవిడిగా వాడటం మనం చూసూ్తనే ఉంటాం.. ఇది కాస్తా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయేందుకు కారణమవుతోంది. మిగిలిన ఎరువుల మాటెలా ఉన్నా ఫాస్ఫరస్‌ను అతితక్కువగా వినియోగించేలా చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గాన్ని గుర్తించారు. ఎరువుగా వేసిన ఫాస్ఫరస్ మట్టిలోని రసాయనాలతో కలసిపోయి మొక్కకు అందకుండా పోతుంటుంది. దీంతో రైతులు అవసరానికి మించి ఫాస్ఫరస్ వాడటం అది కాస్తా నిరుపయోగంగా పరిసరాల్లోని జలవనరుల్లోకి చేరుతుండటం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. చెట్ల వేర్లపై ఉండే ఎండోఫైట్స్ అనే సూక్ష్మజీవులతో ఈ సమస్యను అధిగమించవచ్చునని వాషింగ్టన్ యూనివర్సిటీ, పసిఫిక్ నార్త్‌వెస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఎండోఫైట్స్ మట్టిలోని ఫాస్ఫరస్‌ను మొక్కలకు చేరవేయగలవని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించగా.. తాజాగా వీరు పసిఫిక్ నార్త్‌వెస్ట్ యూనివర్సిటీతో కలసి కొన్ని ప్రయోగాలు చేశారు. పోప్లర్ చెట్టు వేర్ల ప్రాంతంలోని ఎండోఫైట్స్ మట్టిలోని రసాయనాల నుంచి ఫాస్ఫరస్‌ను వేరు చేసినట్లు ఈ ప్రయోగాల్లో తేలింది. పోప్లర్ మొక్కలు ఈ ఫాస్ఫరస్‌ను ఉపయోగించుకున్నట్లు కూడా స్పష్టమైంది. ఎండోఫైట్స్ను కృత్రిమంగా పెంచి మట్టిలోకి కలపడం ద్వారా మొక్కలకు ఫాస్ఫరస్ బాగా చేరేట్టు చేయవచ్చునని లేదా విత్తనాలకు ఎండోఫైట్స్ పూత పూసినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్యాగేజీ ఎక్కడుందో చెబుతుంది శంషాబాద్: ఆధునిక సాంకేతిక వినియోగంతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరో అడుగు పడింది. ప్రయాణికులకు అవసరమైన బ్యాగేజీ ట్రాలీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. దీంతో దేశంలోనే ట్రాలీలకు సాంకేతికను అనుసంధానించిన తొలి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. బ్యాగేజీ ట్రాలీలకు ‘లాంగ్ రేంజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్’అనే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 3 వేల బ్యాగేజీల ట్రాలీలకు ఈ సాంకేతికను అనుసంధానించారు. దీంతో ప్రయాణికులు బ్యాగేజీ ట్రాలీల కోసం ఎదురు చూసే సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాలీలను అందుబాటులో ఉంచే ప్రక్రియ సులువుగా మారుతుంది. ఆపరేషన్ టీంలు ఎయిర్‌పోర్టులోని రియ ల్ టైమ్ డ్యాష్బోర్డులలో పొందుపర్చే సమాచారం ద్వారా ప్రయాణికులకు అనుగుణంగా వాటిని ఆయా ప్రాంతాలకు చేర్చే అవకాశం ఉంటుంది. లాప్టాప్, మొబైల్ల ద్వారా కూడా ట్రాలీలు ఎక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని కూడా వెంటనే తెలుసునే సౌలభ్యం ఉంది. వీటితో పాటు అలర్ట్ మెకానిజం ద్వారా ట్రాలీలను ‘నో ఎయిర్‌పోర్టు జోన్’లోకి ఎవరైనా తీసుకెళితే వెంటనే అప్రమత్తమయ్యే సందేశాలు సంబంధిత విభాగాలకు చేరుకుంటుంది. దీంతో సంబంధిత సిబ్బంది వాటిని వెంటనే సరైన ప్రాంతాలకు తీసుకెళ్తారు. మెరుగైన సేవల్లో భాగంగానే.. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగానే సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణలకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నిరంతరం శ్రమిస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇప్పటికే ఈ– బోర్డింగ్, ఫేస్ రికగ్నిషన్ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీల ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను పెంపొందిస్తున్నాం. –ఎస్జీకే కిశోర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్టుల చీఫ్ ఇన్నోవేషన్ అధికారి -
ఉపవాసం ఎందుకు చేస్తారు?
మనిషి కడుపు నిండా తినడం అనారోగ్యం. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే పొట్టను నాలుగు భాగాలు అనుకుంటే రెండు భాగాలు ఆహారంతో, ఒక భాగం నీటితో నింపి, ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలని. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అయితే, ఈ సూత్రాన్ని అందరూ పాటించరు. అందుకే వారానికోసారి ఒకటి లేదా రెండు పూటలు ఉపవాసం ఉంటే ఆ రోజు ఒంట్లో ఉన్న అధిక కేలరీలను, కొవ్వును శక్తిగా మార్చుకుని శరీరం ఉపయోగించుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఉపవాసాలు చెయ్యాలని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకటి రెండు పూటలు ఉపవాసం ఉన్నాం కదా అని మూడో పూట కడుపును నింపేస్తే ప్రయోజనం శూన్యం. ఎంత ఉపవాసం ఉన్నా పొట్టబరువెక్కేలా తినకూడదు. మితాహారం, ఉపవాసం వల్ల మనిషి నిత్య యవ్వన శక్తితో, ఆరోగ్యంతో ఉంటాడు. ఊరంతా చుట్టాలే, ఉండటానికి తావు లేదు ! మనుషులు జీవితంలో కొన్ని భ్రమల్లో బతుకుతుంటారు. అలా కాకుండా వాస్తవంలో జీవించాలి. లేకపోతే అనేక కష్టాలు ఎదుర్కొంటారన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూనే స్వశక్తిని నమ్ముకోవాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం. ‘ఎంతోమంది మనల్ని నిత్యం పలకరిస్తుంటారు కాబట్టి చాలా పరిచయాలున్నాయి, వారంతా ఆపదలో ఆందుకుంటారులే అనుకుని భ్రమల్లో ఉండకూడదు. అసలు కష్టాలు సమస్యలు వచ్చినపుడు నీతో ఉండేవారు ఎవరు అన్నది నీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నీ నీడ కూడా ఒక్కోసారి నీతో ఉండదు... నువ్వు చీకట్లో ఉంటే. అందుకే నీ శక్తిని, నీ యుక్తిని నమ్ముకుంటే జీవితంలో బాగు పడతావు, పైకి వస్తావు. ఇతరుల మీద ఆధారపడి అంతా నావాళ్లే అనుకుని కలల్లో బతికితే కష్టం వచ్చినపుడు చిక్కుల్లో పడతావు’ అన్నది సామెత వివరణ.