యూపీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ గ్రామంలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ క్రమంలో యువకులను అడ్డుకున్న ప్రయత్నంలో బాలిక సోదరుడి ప్రాణాలు సైతం గాలిలో కలసిపోయాయి. సామూహిక అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఫతేపూర్ చౌరాసి ఎస్ఐ వెల్లడించారు.
నిందితులలో ఇద్దరు మహేంద్ర, నంద కిషోర్‌గా గుర్తించనట్లు చెప్పారు. మరోకరిని గుర్తించవలసి ఉందన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే మైనర్ బాలిక, నిందితులది ఒకే గ్రామమని ఆయన చెప్పారు. రంజీత్ మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అలాగే బాలికను కూడా వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు 9వ తరగతి చదువుతుందని తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం... ఈ రోజు ఉదయం ఫతేపూర్ చౌరసి ప్రాంతంలోని అలె ఖెదా గ్రామానికి చెందిన మైనర్ బాలిక సోదరుడు రంజిత్‌తో కలసి బాయ్ దూజ్ వేడుకలకు బయలుదేరింది. వారు ఉన్నవ్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఆ బాలికను యువకులు ఓ ఇంటిలోకి తీసుకుపోయేందుకు ప్రయత్నించారు.
యువకుల ప్రయత్నాన్ని బాలిక సోదరుడు రంజిత్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతో ఆగ్రహించిన యువకులు అతడిపై దాడి చేశారు. దాంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం ఆ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయన్ని తల్లితండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేశారు.