FB
-
ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది. హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని తాము ఇప్పటికే జేఎన్‌యూలో సంబంధిత అధికారులను కోరగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. కేసుకు సంబంధించిన ఇరు పక్షాల వివరాలు తెలపాలని తాము వాట్సాప్‌కు లేఖ రాశామని, స్పందన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. కాగా, జేఎన్‌యూలో చెలరేగిన హింసకు సంబంధించి ‘యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్’ , ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆరెస్సెస్’ వాట్సాప్ గ్రూపుల డేటాను సెక్యూర్ చేయాలని డిలీట్ అయిన పక్షంలో ఆ డేటాను తిరిగి పొందాలని వాట్సాప్, గూగుల్, యాపిల్‌లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జేఎన్‌యూ ప్రొఫెసర్లు అమిత్ పరమేశ్వరన్, అతుల్ సూద్, శుక్లా వినాయక్ సావంత్‌లు ఈనెల 10న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దిశగా ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ ప్రభుత్వాలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోర్టును కోరారు. -
ఫేస్బుక్ పరిచయంతో ప్రేమ పెళ్లి
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని పోసానీపేట గ్రామంలో భర్త ఇంటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఓ భార్య ఆందోళన చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు సంజన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంజన ఐదేళ్ల కిత్రం రామారెడ్డి మండలం పోసానీపేట గ్రామానికి చెందిన గాండ్ల ప్రవీణ్‌కు ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం అనంతరం ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. వివాహం జరిగి రెండేళ్లు అయింది. తన భర్త ప్రవీణ్ అక్రమ సంబధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సంజన ఆరోపించింది. అలాగే తను గతంలో అనేక సార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం భర్త ప్రవీణ్ ఇంటి ఎదుట తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది. -
అద్దెకు స్నేహితులు!
అద్దెకు స్నేహితులు ఎంటా? అనుకుంటున్నారా.. అవునండీ.. rentafriend.com, rentalocalfriend.com వెబ్ సైట్లు స్నేహితులను అద్దెకు పంపిస్తున్నాయి. ఇప్పుడు దేశ రాజధానిలో ఈ ట్రెండ్ పెరిగిపోతోంది. ఖాళీగా, మూడీగా ఉండే వారందరూ(అమ్మాయైనా, అబ్బాయైనా) ఈ వెబ్ సైట్ల ద్వారా రిజిస్టర్ అయి కొత్త స్నేహితులను కలుసుకుంటున్నారు. ఒక్క కాఫీకే పరిమితం కాకుండా సినిమా, డిన్నర్ విత్ పేరెంట్స్ ఇలా సర్వీసులు మారే కొద్ది అద్దె పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఒక గంటసేపు కాఫీకి సమయాన్ని వెచ్చిస్తే రూ.600లు చెల్లించాల్సి వస్తోంది. ఈ కల్చర్ పై ఆయా వెబ్ సైట్ల ప్రతినిధులను సంప్రదించగా.. మోసాలకు అవకాశం లేకుండా కేవలం చెప్పిన సమయానికి మాత్రమే అద్దెకు స్నేహితులను కలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం మొదట రూ.1,000 నుంచి రూ.1,500లు మెంబర్ షిప్ కింద వినియోగదారులు చెల్లించాల్సివుంటుందని తెలిపారు. ఆ తర్వాతే తమ సేవలను వినియోగించుకోగలరని చెప్పారు. అయితే, సభ్యుల పూర్తి వివరాలను తీసుకోవడంలేదని వివరించారు. సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో కూడా 'మీట్ ఫ్రెండ్స్', 'లవ్ ఆన్ హైర్', 'బీఎఫ్స్ ఆన్ ఎన్సీఆర్' వంటి పేజీలు గంటల బేసిస్ మీద ఫ్రెండ్స్, లవర్స్ ను అద్దెకు ఇస్తున్నాయి. వీటిలో 'లవ్ ఆన్ హైర్' అనే ఫేస్ బుక్ పేజీని 25,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు. వీటిపై మాట్లాడిన కొంతమంది యూత్ పేజీల సాయంతో కొత్త వ్యక్తుల పరిచయంతో పాటు మీటింగ్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠత కూడా కలుగుతోందని అన్నారు. యూత్ లో ప్రస్తుతం పెరుగుతున్న ఈ కల్చర్ వారి స్వభావాలకు అద్దం పడుతోందని నిపుణులు చెప్పారు. యూత్ తమ సోల్ మేట్ ను నిర్ణయించుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. -
ఫేస్ బుక్ లో పెళ్ళి రద్దు..!
భారత స్త్రీలకు రోల్ మోడల్ గా మారింది కేరళకు చెందిన ఓ మహిళ. తన పెళ్ళిని రద్దు చేసుకుంటూ ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్ట్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కేరళ త్రిస్సూర్ కు చెందిన రెమ్యా రామచంద్రన్ స్వయం నిర్ణయాధికారంతో స్త్రీ శక్తిని చాటింది. వర కట్నాన్నీ, పురుషాధిక్యాన్నీ వ్యతిరేకిస్తూ తన నిర్ణయాన్ని చాటడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. నిశ్చితార్థం తర్వాత తనకు నచ్చని పెళ్ళిని రద్దు చేసుకుంది. అందుకు వివరణ ఇస్తూ తన నిర్ణయాన్ని ధైర్యంగా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ''ఫ్రెండ్స్... నా పెళ్ళి గురించి అడుగుతున్న కొందరు మిత్రులకు ఇక్కడ నేను ఓ ప్రకటన ఇస్తున్నాను. నిశ్చితార్థానికి ముందు నన్ను పెళ్ళి చేసుకుంటానన్న వ్యక్తి... కేవలం నువ్వుంటే చాలని చెప్తుండేవాడు. ఇప్పుడు ఐదు లక్షల కట్నంతోపాటు... 50 తులాల బంగారం కూడ డిమాండ్ చేస్తున్నాడు. నేను వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు" అన్న.. రెమ్యా ఫేస్ బుక్ పోస్టుకు ఎంతో మద్దతు లభించింది. అంతేకాదు.. ఎందరో రెమ్యాను అభినందిస్తూ, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావంటూ కామెంట్లు పంపారు. ''మీవంటి స్త్రీలు మహిళా లోకానికే స్ఫూర్తిదాయక''మని, ''యువతకు మీరో రోల్ మోడల్'' అని ఇబ్బడి ముబ్బడిగా కామెంట్లను పంపుతూ సపోర్ట్ చేశారు. తమ మనసుకు నచ్చిన, మెచ్చిన రీతిలో మహిళలు జీవించే రోజులు వచ్చినట్లు రెమ్యా నిర్ణయం చెప్తోంది. స్థైర్యం, ధైర్యంతో స్వేచ్ఛను సొంతం చేసుకునే ఘడియలు ఆసన్నమయ్యాయని నిరూపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్ళు గడిచినా... ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం ఉన్నా... జీవితాన్ని తమకిష్టమైన రీతిలో మలచుకోగలిగే స్థానంలో నేటికీ స్త్రీలు కనిపించడం లేదు. కులం, ఆచారాలు, సంప్రదాయాలు వెనక్కులాగుతుండటంతో... చదువులో, కెరీర్లో అత్యున్నత ప్రతిభను కనబరిచిన వారు కూడా పెళ్ళి విషయంలో మాత్రం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచ లేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఇటువంటి స్త్రీలకు రెమ్యా రోల్ మోడల్ గా మారింది. -
ఫేస్బుక్ లో ఇదో రికార్డట!
ముంబై: సెలబ్రిటీలు ఏం చేసినా అభిమానులకు పండుగే. ముఖ్యంగా తాము ఆరాధించే హీరో, హీరోయిన్ల వ్యక్తిగత ముచ్చట్లు, కులాసా కబుర్లు తెలిస్తే వారికి సందడే సందడి. బాలీవుడ్ యువహీరో షాహిద్ కపూర్ విషయంలోనూ అదే జరిగింది. షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్‌పూత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోమవారం రాత్రి తన ఫేస్బుక్ లో షేర్ చేశాడు. ఇక అంతే... క్షణాల్లో అది వైరల్ అయిపోయింది. ఎంతగా ప్రచారం అంటే.. కేవలం 24 గంటల్లోనే దాదాపు 12 లక్షల పై చిలుకు లైక్స్‌ని సంపాదించింది. అభిమానులు అక్కడితో ఆగలేదు. దాదాపు 5,700 షేర్లతో రికార్డు సృష్టించారు. అంతేనా 10 వేలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి. తమ అభిమాన హీరో ముచ్చటైన ఫోటోను చూసి తెగ మురిసిపోతూ కామెంట్ల వర్షం కురిపించేశారు. కాగా బాలీవుడ్ లవర్ బాయ్ గా ఇమేజ్ కొట్టేసిన షాహిద్ కపూర్ ఇటీవల ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. తనకంటే పది సంవత్సరాలు చిన్నదైన, ఈ ఢిల్లీ గాళ్‌ను ఎక్కడికెళ్లినా... చివరకు జిమ్ కు కూడా తన వెంట తీసుకెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం అలవాటు షాహిద్‌కు. అంతేకాకుండా ఆమెతో స్పెషల్ ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇదంతా స్పెషల్ అపియరెన్స్ కోసమేనని.. మీరా రాజ్‌పుత్ ను హీరోయిన్ చేసేందుకే షాహిద్ కపూర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. -
ఫేస్బుక్ నేపథ్యంగా ఎఫ్బీ
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఎఫ్బీ (ఫేస్బుక్) ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సెంథిల్నాథన్ అన్నారు. సింగపూర్‌కు చెందిన ఎస్ఎస్వీఎస్ఎస్కే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు సురేష్‌శర్మ హీరోగా పరిచయం అవుతున్నారు. అతిథి ఆచార్య,దేవిక, శ్రుతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నటుడు రఘు, ఢిల్లీ గణేశన్, హీరాక్రిష్ణన్, స్వామినాథన్, శ్యామ్, పాండు ముఖ్య పాత్రలు ధరించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఎఫ్బీ చిత్రం రెగ్యులర్ చిత్రంలా ఉండదన్నారు.ఫేస్బుక్ ఇతివృత్తంగా చిత్రం సాగుతుందన్నారు. ఫేస్‌బుక్‌ను తప్పుగా ఉపయోగించి చిక్కుల్లో పడ్డ యువకులు ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డారన్నది చిత్ర కథ అని తెలిపారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఎవరూ హీరోయిన్లుగా కనిపించరన్నారు.అలాగే వాణిజ్య అంశాల కోసం వారిని నటింపజేయలేదని అన్నారు. ఈ చిత్రాన్ని త్వరలో తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా దేశాలలోనూ విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.