ఫేస్బుక్ నేపథ్యంగా ఎఫ్బీ
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఎఫ్బీ (ఫేస్బుక్) ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సెంథిల్నాథన్ అన్నారు. సింగపూర్‌కు చెందిన ఎస్ఎస్వీఎస్ఎస్కే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు సురేష్‌శర్మ హీరోగా పరిచయం అవుతున్నారు. అతిథి ఆచార్య,దేవిక, శ్రుతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నటుడు రఘు, ఢిల్లీ గణేశన్, హీరాక్రిష్ణన్, స్వామినాథన్, శ్యామ్, పాండు ముఖ్య పాత్రలు ధరించారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఎఫ్బీ చిత్రం రెగ్యులర్ చిత్రంలా ఉండదన్నారు.ఫేస్బుక్ ఇతివృత్తంగా చిత్రం సాగుతుందన్నారు. ఫేస్‌బుక్‌ను తప్పుగా ఉపయోగించి చిక్కుల్లో పడ్డ యువకులు ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డారన్నది చిత్ర కథ అని తెలిపారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఎవరూ హీరోయిన్లుగా కనిపించరన్నారు.అలాగే వాణిజ్య అంశాల కోసం వారిని నటింపజేయలేదని అన్నారు. ఈ చిత్రాన్ని త్వరలో తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా దేశాలలోనూ విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.