federal budget
-
కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్ పాలసీలే కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిమాణాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో సూచీలు తడబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కేసుల అనూహ్య పెరుగుదల, ఆర్థిక వృద్ధి ఆందోళనలతో గతవారం నాలుగురోజుల ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి. అయితే అదేవారంలో విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. ‘‘యూఎస్, యూరప్ మార్కెట్లు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సైతం ఆల్‌టైం హైకి చేరువలో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తే సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చు. తర్వాత గరిష్ట స్థాయిల్లో కొంత స్థిరీకరణ జరగవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది. దిగువస్థాయిలో 15,800 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా అభిప్రాయపడ్డారు. అందరి చూపు ఫెడ్ సమావేశం వైపే... అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూన్ 27న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఎఫ్అండ్ఓ ముగింపునకు ముందు అప్రమత్తత ఈ గురువారం జూలై సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఆగస్ట్ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను స్కోర్ ఆఫ్ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడకులకు లోనుకావచ్చు. గురువారం తత్వ చింతన్ ఫార్మా లిస్టింగ్ ... స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ తత్వ చింతన్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ఈ జూలై 16–20 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 1,073–1,083 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను విక్రయానికి ఉంచగా.., 58.83 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. 180 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.1,083తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.1,000 ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు 92% లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. ఇదే వారంలో రెండు ఐపీఓలు రెండు కంపెనీలు ఇదే వారంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ జూన్ 27 ప్రారంభమై, ఇదే నెల 29న ముగుస్తుంది. షేరుకి ధరల శ్రేణి రూ.695–720గా నిర్ణయించి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 1,513.6 కోట్లను సమకూర్చుకోనుంది. మరో కంపెనీ రోలాక్స్ రింగ్స్ ఇష్యూ 28–30 తేదీల మధ్య జరనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.56 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బ్రిటానియా, యూపీఎల్, ఐఓసీలతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై 1–23 తేదీల మధ్య రూ.5,689 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల వ్యాల్యూయేషన్లు, యూఎస్ కరెన్సీ డాలర్ విలువ, క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో స్వల్పకాలిక రిస్క్ దృష్ట్యా మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. -
పాకిస్తాన్‌లోనే అండర్ వరల్డ్ డాన్
న్యూఢిల్లీ : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నట్లు ఆధారాలు లభించాయి. దావూద్ పాక్‌లోనే ఉన్నాడన్న భారత్ ఆరోపణలను దాయాది దేశం పదే పదే ఖండించినప్పటికీ, అతడు పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు జీ-న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. గత 25 ఏళ్లుగా పరారీలో ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు, డి-కంపెనీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న జబీర్ మోతీవాలాను దావూద్ కలిసినట్లుగా ఉన్న ఫోటోలు లభించినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను జీ న్యూస్ విడుదల చేసింది. ఇందులో క్లీన్‌షేవ్‌లో ఉన్న దావూద్‌ను మనం చూడవచ్చు. నిజానికి అతడు మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చినా.. ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం... మోతీవాలా కరాచీలోని దావూద్ ఇళ్లు క్లిఫ్టన్ హౌస్ పక్కనే నివసిస్తున్నాడు. అతను దావూద్ భార్య మెహజబిన్, అతని కుమారుడు మొయిన్ నవాజ్‌లతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు.కాగా వ్యాపారవేత్త ముసుగులో మోతీవాలా దోపిడీలకు పాల్పడటంతో పాటుగా.. హెరాయిన్ స్మగ్లింగ్ చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఎఫ్‌బీఐ అతడిని అరెస్టు చేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ స్కాట్లాండ్ యార్డ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతీవాలా కేవలం వ్యాపారవేత్త మాత్రమేనని, అతడిని అమెరికా ప్రభుత్వానికి అప్పగించలేమని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో దావూద్‌తో కలిసి అతడు కరాచీలో ఉన్నట్లుగా వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో దావూద్ ఉనికి గురించి మోతీవాలా ఇప్పటికే వెల్లడించినట్లు ఎఫ్‌బీఐ సంస్థ తెలిపింది.మోతీవాలా దావూద్ కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి గనుక అతడి వద్ద డి-కంపెనీ డాన్ గురించి అతని దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంటుందనే నేపథ్యంలో .. డి-కంపెనీ కార్యకలాపాలపై ఎఫ్‌బీఐని సంప్రదించడానికి భారత ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. కాగా ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రకారం.. ‘మోతీవాలా 10సంవత్సరాలుగా యూకే వీసాతో అక్కడ ఉంటున్నాడు. ఇది 2028తో ముగియనుంది. అయితే గత కొన్ని నెలలుగా అతడు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్ కంపెనీలో 2 మిలియన్ డాలర్లు జమ చేశాడు’ అని వెల్లడైంది. అయితే దావూద్‌కు పరోక్షంగా సహకరిస్తున్న పాకిస్తాన్.. మోతీవాలాను కాపాడేందుకు యత్నిస్తోంది. మోతీవాలాపై ఎఫ్‌బీఐ మోపిన అభియోగాలను లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనం. మోతీవాలా ఒక గౌరవ వ్యాపారవేత్త అని, అతడికి డి-కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ హైకమిషన్ పేర్కొంది. అంతేగాక ఈ మేరకు యూకే వెస్ట్‌మినిస్టర్ కోర్టులో న్యాయమూర్తికి లేఖ ఇచ్చింది. ఈ విషయాలన్నీ నిశితంగా పరిశీలించినట్లైతే మోతీవాలా అరెస్టుతో దావూద్ ఆచూకీ బహిర్గతం అవుతుందని పాక్ ఎంతగా వణికిపోతుందో అర్థమవుతోంది. ఇక మోతీవాలా ఆచూకీ కనుగొనేందుకు ఎఫ్‌బీఐ అతడితో హెరాయిన్ ఒప్పందం కుదుర్చుకుని ట్రాప్ చేసిన సంగతి తెలిసిందే. దావూద్, మోతీవాల వ్యవహారాలకు సంబంధించి ఇన్ని ఆధారాలు లభించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం వారిని వెనకేసుకురావడం చూస్తుంటే ఉగ్రవాదుల పట్ల దాయాది దేశం వైఖరేంటో స్పష్టంగా తెలుస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రముఖులను కలవరపెడుతున్న ట్రంప్ బడ్జెట్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురాబోతున్న తొలి బడ్జెట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాలకు సహాయం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం పలువురు ప్రముఖులను కలవర పెడుతోంది. ట్రంప్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్ ను కనుక ఆమోదిస్తే, ప్రపంచంలో అమెరికానే తక్కువ సుసంపన్నమైన, తక్కువ సురక్షితమైన దేశంగా ఉంటుందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. బడ్జెట్ ప్రతిపాదనలతో తాము పూర్తిగా సమస్యల ఉచ్చులో కూరుకుపోతామని, ఇది పేద ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని ఫౌండేషన్ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ల్మన్ అన్నారు. దేశంలో ఉన్నవారిని, విదేశీయులను ఎంతో ప్రభావితం చేయనుందన్నారు. ట్రంప్ బడ్జెట్ ఎక్కువగా రక్షణ వ్యవహారాలకు సహాయపడుతుందని, మిగతా వాటిని పట్టించుకోవడం లేదని వాపోయారు. విద్యుత్, రవాణా, వ్యవసాయం, పర్యావరణం వంటి డిపార్ట్ మెంట్లను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజలను ఆరోగ్యవంతంగా, సుస్థిరమైన సంఘాలలో జీవించే విధంగా సహకరించాలని, ఇది జాతి భద్రతకంటే కూడా ఎంతో క్లిష్టతరమైన అంశమని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. గురువారం ట్రంప్ బడ్జెట్ బ్లూప్రింట్ ను విడుదల చేశారు. అమెరికా ఫస్ట్ పేరుతో వచ్చిన ఈ బడ్జెట్లో విదేశీ సహాయాలు తగ్గిస్తున్నట్టు ప్రతిపాదించారు. -
29 వరకు అసెంబ్లీ పొడిగింపు
బడ్జెట్ సమావేశాలపై బీఏసీ భేటీలో నిర్ణయం 28న ద్రవ్య బిల్లుకు ఆమోదం రేవంత్ విషయాన్ని వదిలేయాలని జానా సూచన క్షమాపణ చెప్పేదాక వదలరన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 29 దాకా పొడిగించారు. స్పీకర్ మదుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం జరి గిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా రు. వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు వివిధ పద్దులు, శాఖలవారీ డిమాండ్లపై చర్చించనున్నారు. నాలుగు రోజులూ సభ రెండు పూట ల సమావేశమవుతుంది. తర్వాత శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లును ఉభయసభల్లో ఆమోదించనున్నారు. వివిధ శాఖల పద్దులపై అన్ని పార్టీల అభిప్రాయాలను వెల్లడించే విధంగా ఈ నెలాఖరు దాకా సమావేశాలను పొడిగించాలని పలు పార్టీలు కోరాయి. బడ్జెట్ ఆమోదానికి డిసెంబర్ 2 వరకు అవకాశముందని కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ సభ్యులు గుర్తు చేశారు. శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించడానికి మూడు రోజు లు అవసరమైనందున, ఈ నెల 29 వరకు సమావేశాలను పొడిగించేందుకు బీఏసీ నిర్ణయించింది. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమం త్రి టి.రాజయ్య, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, జి.చిన్నారెడ్డి(కాంగ్రెస్), డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), తాటి వెంకటేశ్వర్లు(వైఎస్సార్ కాం గ్రెస్), సున్నం రాజయ్య(సీపీఎం), ఆర్.రవీంద్రకుమార్(సీపీఐ) హాజరయ్యారు. సమావేశం నుంచి టీడీపీ వాకౌట్ బీఏసీలో సభ్యుల సంఖ్య విషయంలో స్పీకర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ వాకౌట్ చేసింది. టీడీపీ తరఫున ఒకరికి సభ్యునిగా, మరొకరికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించాలని గత బీఏసీ భేటీలో నిర్ణయించారు. తాజా భేటీకి టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి రావొద్దంటూ ప్రభుత్వం షరతు విధించించడంతో తమ పార్టీ నుంచి ఎంతమందికి అవకాశం కల్పిస్తారో రాతపూర్వకంగా చెప్పాలని టీడీపీ సభ్యు లు డిమాండ్ చేయగా స్పీకర్ నిరాకరించారు. దీంతో వాకౌట్ చేస్తున్నట్టుగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సండ్ర వెంకటవీరయ్య వెళ్లిపోయారు. కాగా ‘రేవంత్ తప్పుగా మాట్లాడినట్టుగా మీరు భావిస్తే ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలిపెట్టండి. వెంటపడి వేధిస్తున్నట్టుగా కనిపించడం ప్రజాస్వామ్యంలో తప్పుడు సంకేతాలిస్తాయి’ అని బీఏసీలో జానారెడ్డి పేర్కొన్నారు. క్షమాపణ చెప్పేదాకా టీఆర్ఎస్ సభ్యులు వదలరని సీఎం వ్యాఖ్యానించారు.