ప్రేమలో భంగపడినా మరింత మనిషినవుతా..
హార్ట్ బ్రేకింగ్ వల్లగానీ, ప్రేమలో పడటం వల్లగానీ తనకేమి పెద్దగా బాధగా ఉండదని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్ గాయకుడు శ్యామ్ స్మిత్. తను ఎంతగానో ఇష్టపడిన వ్యక్తులు తనను వదిలేసి గాయపరిచిన, ప్రేమలో భంగపడినా తనకు మరింత మానవత్వంతో ఆలోచించగలిగే శక్తి వస్తుందని చెప్తున్నారు.
'తప్పుల విషయంలో నేను నా ఆత్మతో చెప్తాను. నీకింకా 22 సంవత్సరాలు. నువ్విప్పుడు ఎంతమందితోనైనా ప్రేమలో పడగలవు. చివరికి హృదయాన్ని బద్దలుకొట్టుకుంటావు. అయితే, దానివల్ల నేనేమీ బాధపడను.. అలాగే జరిగితే నేను మంచి మనిషిగా మరింత ఆలోచిస్తానుగానీ పట్టించుకోను' అని అంటున్నారు.