Female Police Officer
-
వివాహమైన రెండు నెలలకే..
అన్నానగర్: వివాహమైన రెండు నెలలకే బైక్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో భర్తతో పాటూ మహిళా పోలీసు దుర్మరణం చెందిన ప్రమాదం సోమవారం చిదంబరంలో కలకలం రేపింది. వివరాలు.. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో ఉన్న జయంకొండాన్కు చెందిన మహిళ ఇలవరసి. ఈమె చిదంబరం సమీపంలో కుమరాట్చి పోలీసు స్టేషన్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త కలైవేందన్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ స్థితిలో ఇలవరసి తన భర్తతో కలిసి చిదంబరం సమీపంలోని వీరన్కోవిల్దిట్టు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యక్రమంలో పాల్గొనడం కోసం బైకులో వెళ్లారు. వారు చిత్తాలపట్టి గ్రామం సమీపంలో వెళుతుండగా ఎదురు వైపుగా కొడియంపాళయం గ్రామం నుంచి చిదంబరం వైపుగా వచ్చిన ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా ఇలవరసి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌తో పాటు ఇద్దరిని బస్సు ఈడ్చుకెళ్లింది.దీంతో తీవ్రంగా గాయపడి ఇలవరసి, కలైవేందన్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అన్నామలైనగర్ పోలీసులు బస్సు కింద శిథిలాల్లో చిక్కుకున్న దంపతుల మృతదేహాలను శవపంచనామా నిమిత్తం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా వీరికి గత నవంబర్ నెలలో వివాహం కావడం గమనార్హం. వివాహమైన రెండు నెలలకే నవ దంపతులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతం వారిని శోకంలో ముంచేసింది. -
స్కూటీపై మహిళా ఎస్ఐ కుమారుడు వీలింగ్
మైసూరు: ప్రజలు, వాహన చోదకులు భయకంపితులు అయ్యేలా ఒక మహిళా ఎస్ఐ కుమారుడు స్కూటీపై వీలింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన మహిళా ఎస్ఐ కుమారుడు సయ్యద్ ఐమన్ స్నేహితులతో కలిసి నగరంలోని రింగ్ రోడ్డులో స్కూటీపై వీలింగ్ చేశాడు. తలకు హెల్మెట్ కూడా ధరించలేదు. ఇదేదో ఘనకార్యం అన్నట్లుగా వీలింగ్ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. దీనిని అనేక మంది ట్రోల్ చేయగా విషయం సిద్ధార్థ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి ఎస్ఐ కుమారుడిని అరెస్ట్ చేసి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. -
వైరల్ వీడియో: ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
-
ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
వైరల్: ‘దేవుడు మరో అవకాశం ఇస్తే..’ ఇప్పుడున్న జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని కోరుకుంటారు ఎక్కువ మంది!. కానీ, ఈ అందమైన శివంగి మాత్రం అలా కాదు.. తాను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటోంది. అది శారీరకంగా కాదు.. మానసికంగా!. డబ్బు కోసమో, సుఖం కోసమో ఆమె అస్సలు ఆశపడడం లేదు. ఎందుకంటే.. వ్యవస్థలో చెడుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె.. తనలాగే బతకాలనుకుంటోంది కాబట్టి! కొలంబియా మెడెలిన్‌కు చెందిన డియానా రామిరెజ్diana ramirez.. ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఆమె అందం. ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసాఫీసర్‌గా ఇంటర్నెట్లో ఆమెపై ఓ ప్రచారం నడుస్తోంది. అఫ్కోర్స్.. ఈమె కంటే అందగత్తెలు ఉండొచ్చు. కానీ, ఇప్పటికైతే ఈమెదే హవా నడుస్తోంది. View this post on Instagram ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరున్న మెడెలిన్ వీధుల్లో పోలీస్ అధికారిణిగా డియానా రామిరెజ్ పహారా కాస్తూ కనిపిస్తుంటుంది. రోజులో 14 గంటలు ఆమె డ్యూటీలోనే గడుపుతోంది. ఈ సర్వీసులో ఇప్పటిదాకా వీరోచితంగా ఛేజ్ చేసి ఆమె ఎంతో మంది నేరగాళ్ల ఆటకట్టించింది కూడా. అందంగా ఉంది.. రిస్క్ చేసి ఈ ఉద్యోగం చేయడం ఎందుకు? హాయిగా ఏ మోడల్ కుదరకుంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కావొచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు ఆమెకు. కానీ, ఆమె మాత్రం ‘నో’ అని తెగేసి చెప్తోంది. ‘‘ఒకవేళ మరోసారి కెరీర్‌ను ఎంచుకోమని దేవుడు అవకాశం ఇస్తే.. నేను పోలీస్ వృత్తినే ఎంచుకుంటా. ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం నాకు ఇష్టం. ఈ వృత్తి నాకు ఎంతో నచ్చింది. పోలీస్ వ్యవస్థ కూడా నాకు అంతే గౌరవం ఇచ్చింది. రంగు, రూపం, అందం ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి. కానీ, శాశ్వతమైంది మాత్రం ఆత్మవిశ్వాసమే. నా తల్లిదండ్రులు నాలో దేశభక్తిని నింపారు.నా దేశం కోసం.. నేరరహిత సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వీడే ప్రసక్తే లేదు. రిస్క్ చేయడంలోనే మజా ఉంటోంది కదా అని చెబుతోందామె. తాజాగా డియానా రామిరెజ్ను బెస్ట్ పోలీస్/మిలిటరీ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుకు నామినేట్ చేశారు అక్కడ. బాధ్యత గల వృత్తుల్లో ఉంటూ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎక్కువ మందిని ఆకట్టుకునేవాళ్లకు ఈ గుర్తింపు ఇవ్వాలని ఇన్‌స్టాఫెస్ట్ అవార్డుల పేరుతో ఓ మీడియా హౌజ్ అవార్డులను ప్రదానం చేయడం ప్రారంభించింది అక్కడ. -
లేడీ గబ్బర్ సింగ్
సంఘ విద్రోహ శక్తులపై ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ విజృంభించి, వారి ఆట ఎలా కట్టించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంఎస్. యూసఫ్ నిర్మిస్తున్నారు. సాజిద్ ఖురేషి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లేడీ గబ్బర్ సింగ్ గా నిషా కొఠారీ బాగా నటించారనీ, గ్లామర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించామనీ దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: వి. సురేశ్‌కుమార్, సంగీతం: గున్వంత్.