మైసూరు: ప్రజలు, వాహన చోదకులు భయకంపితులు అయ్యేలా ఒక మహిళా ఎస్‌ఐ కుమారుడు స్కూటీపై వీలింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన మహిళా ఎస్‌ఐ కుమారుడు సయ్యద్ ఐమన్ స్నేహితులతో కలిసి నగరంలోని రింగ్ రోడ్డులో స్కూటీపై వీలింగ్ చేశాడు.
తలకు హెల్మెట్ కూడా ధరించలేదు. ఇదేదో ఘనకార్యం అన్నట్లుగా వీలింగ్ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. దీనిని అనేక మంది ట్రోల్ చేయగా విషయం సిద్ధార్థ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి ఎస్‌ఐ కుమారుడిని అరెస్ట్ చేసి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment