రూ.23 లక్షల గంజాయి సీజ్
కోలారు: ఆటోలో తరలిస్తున్న గంజాయిని ముళబాగిలు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. జిల్లాలోని మాలూరు తాలూకా వెంకటరాజనహళ్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, (44), కడదనహళ్లి గ్రామానికి చెందిన మనోహర (26) పట్టుబడినవారు. వీరు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఆటోలో గంజాయిని తీసుకువస్తున్నట్లు తెలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి విలువ రూ. 23 లక్షలుగా అంచనా వేశారు. విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ చేపట్టారు.
నిలిచిన లారీని
రెండు లారీలు ఢీ
● ముగ్గురు డ్రైవర్ల మృతి
దొడ్డబళ్లాపురం: రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని రెండు లారీలు వరుసగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన చిత్రదుర్గ తాలూకా సీబార గ్రామం వద్ద 48వ హైవేలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ తాడిపత్రికి చెందిన శేఖర్ (55), తమిళనాడు ధర్మపురికి చెందిన పెరియస్వామి (50), ఉత్తరప్రదేశ్ అలీగడ్‌కు చెందిన జబరుద్దీన్ (52) మృతులు. వస్త్రాల లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి టైర్ మారుస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన రెండు లారీలు దీనిని ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో మూడు లారీల డ్రైవర్లు గాయాలతో మరణించారు. ఓ లారీలోని కళింగర కాయలు చెల్లాచెదరుగా పడిపోయాయి. గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిత్రదుర్గ రూరల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
చేజింగ్ చేసి
గరుడ ముఠా క్రిమినల్ అరెస్టు
యశవంతపుర: ఉడుపి జిల్లా మణిపాల్‌లో గరుడ గ్యాంగ్‌కు చెందిన మోస్ట్ వాటెండ్ క్రిమినల్ ఇసాక్‌ను బెంగళూరు గ్రామాంతర జిల్లా నెలమంగల పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. గరుడ గ్యాంగ్ పేరుతో ముఠా పెట్టుకుని కరావళిలో డ్రగ్స్ దందా, రౌడీయిజం, గొడవలకు పాల్పడుతున్నారు. గతేడాది ఉడుపిలో కత్తులతో పోట్లాటకు దిగి ప్రజల్లో భయాందోళన కలిగించారు. నడిరోడ్డుపై ప్రత్యర్థులపై దాడులకు పాల్పడేవారు. నెలమంగలకు చెందిన పలువురిని బెదిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసాక్‌ని పట్టుకోవడానికి వెళ్లగా కారులో పరారయ్యాడు. పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. ఈ చేజింగ్‌లో నాలుగు కార్లు, ఒక బైకును ఢీకొనడంతో దెబ్బతిన్నాయి.
అప్పు ష్యూరిటీకి ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య
యశవంతపుర: అప్పు ఇవ్వడానికి ష్యూరిటీ సంతకం చేయాలని ఒత్తిడి చేయటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా బిక్కూడు గ్రామంలో జరిగింది. జమున (44) మృతురాలు. వివరాలు.. ఆమెకు తెలిసిన సందీప్, ధనుశ్రీ దంపతులు రూ.10 లక్షలు అప్పు తీసుకోవాలనుకున్నారు. ఇందుకు పూచీకత్తుగా సంతకం చేయాలని జమునను ఒత్తిడి చేశారు. దీనికి జమున ఒప్పకోలేదు. సంతకం పెట్టకుంటే నీ కొడుకును హత్య చేస్తామని వారు బెదిరించటంతో జమున భయపడిపోయింది. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఇంట్లో డెత్‌నోట్ లభించింది. సందీప్, ధనుశ్రీలే కారణమని పేర్కొంది. దీంతో ఘరానా దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలల క్రితం జమున భర్త చనిపోయాడు, ఇప్పుడు వారి కుమారుడు సాత్విక్ (21) అనాథ అయ్యాడు.
రూ.23 లక్షల గంజాయి సీజ్
రూ.23 లక్షల గంజాయి సీజ్
రూ.23 లక్షల గంజాయి సీజ్
Comments
Please login to add a commentAdd a comment