34 వేల ఎకరాల ఆలయ భూముల కబ్జా
సాక్షి, బెంగళూరు: వివిధ నిగమ మండళ్లకు గంగా కళ్యాణ యోజన కింద లబ్ధిదారులను సంఖ్యను పెంచాలి, లేదంటే ఈ కార్యక్రమాన్ని వదిలేయాలని పార్టీలకతీతంగా సభ్యులు బుధవారం విధానసభలో డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో డాక్టర్ చంద్రు లమాణి.. తాండాల అభివృద్ధి నిగమ మండలి ద్వారా గంగా కళ్యాణ యోజన కింద లబ్ధిదారులకు బోరుబావులు మంజూరు చేస్తున్నారని, ఇందుకోసం వేలాదిగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆమోదించలేదని ఎమ్మెల్యేలకు చెడు పేరు వస్తోందని, అంందుకే ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ డిమాండ్‌కు బీజేపీ నేతలు ఆర్.అశోక్, సునీల్ కమార్, అరగ జ్ఞానేంద్ర, సిమెంట్ మంజు తదితర సభ్యులు మద్దతు పలికారు. మంత్రి మహదేవప్ప మాట్లాడుతూ లబ్ధిదారుల సంఖ్యను పెంచుతామని హామీనిచ్చారు. అయితే గత ప్రభుత్వంలో బోరుబావులను తవ్వించడంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం సుమారు 18 వేల బోరుబావులను తవ్వించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
ఉభయ సభల్లో చర్చకు వచ్చిన పలు అంశాలు
● మన భూమి.. మన రోడ్డు పథకం ముగిసిపోయిందని, అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త పథకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్ సందర్భంగా ప్రస్తావిస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో నవలగుంద ఎమ్మెల్యే ఎన్.హెచ్.కోనరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
● బర్డ్‌ఫ్లూ మనుష్యులకు సోకడం చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య మంత్రి దినేశ్ గుండూరావు విధానసభలో తెలిపారు.
● గ్యారెంటీ పథకాలను కొనసాగిస్తామని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతామని వ్యవసాయ మంత్రి ఎన్.చెలువరాయస్వామి విధానసభలో తెలిపారు. ప్రతిపక్షాలు మంచి సలహాలను ఇస్తే స్వీకరిస్తామన్నారు.
● గ్రామ పరిపాలన అధికారులకు ల్యాప్‌టాప్‌లను అందిస్తామని విధానపరిషత్‌లో రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
● రైతులు, వినియోగదారులకు అనుకూలమైన విధంగా పాల ధరల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విధాన పరిషత్‌లో పశుసంవర్ధక మంత్రి వెంకటేశ్ తెలిపారు.
● మంగళూరు ప్రైవేటు కాలేజీ విద్యార్థి అదృశ్యంపై జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. విధానసభ జీరో అవర్‌లో స్పీకర్ యూటీ ఖాదర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
● రాష్ట్రంలో 26 లక్షల నకిలీ భవన నిర్మాణ కార్మికుల కార్డులను గుర్తించినట్లు, వాటిని రద్దు చేసినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ విధానసభలో తెలిపారు.
కుర్చీలాట జరుగుతోంది
రాష్ట్రంలో సీఎం కుర్చీలాట జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ విధానసభలో విమర్శించారు. హోం మంత్రి ఢిల్లీకి వెళ్లి వచ్చి తానే సీఎం అవుతానని చెబుతారని, మరోవైపు డీసీఎం డీకే శివకుమార్ సీఎం కాబోతున్నట్లు ప్రకటిస్తారని హేళన చేశారు. గందరగోళం లేకుండా అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
లైవ్ గొడవ, అధికారి సస్పెండ్
విధానసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంలో ప్రతిపక్ష సభ్యులను చూపించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఓ అధికారిని సస్పెండ్ చేశారు. కేవలం అధికార పక్షం సభ్యులనే చూపించడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లైవ్‌లో తమను చూపించడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు గొడవ చేయడం తెలిసిందే.
పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి
పార్టీలకు అతీతంగా విధానసభలో డిమాండ్లు
పెంపునకు మంత్రి హామీ
రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని 34 దేవస్థానాలకు చెందిన 34 వేల ఎకరాల భూమిని ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు అందులో సుమారు 15,413 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.
కాడుగొల్లలను ఎస్సీలలో చేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్లు , కేంద్రంకొన్ని వివరాలు కోరిందని, సాంఘిక సంక్షేమ శాఖతో చర్చించి ఆ వివరాలు సమర్పిస్తామని కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ తంగడిగి తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభివృద్ధి పాలక మండలిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని విధానసభలో మంత్రి మహదేవప్ప తెలిపారు.
బనశంకరి: రాజధానిలో ఎంతో చర్చ జరుగుతున్న గ్రేటర్ బెంగళూరు పాలక బిల్లును అసెంబ్లీ జాయింట్ పరిశీలనా కమిటీ అధ్యక్షుడు రిజ్వాన్ హర్షద్ బుధవారం విధానసభలో సమర్పించారు. కమిటీ బెంగళూరులో పలు దఫాలుగా సమావేశాలు జరిపి ప్రజల నుంచి సలహాలను స్వీకరించింది.
నివేదికలో ప్రముఖ అంశాలు...
2025 కి బెంగళూరులో ఒకటిన్నర కోట్ల ప్రజలకు నిలయంగా మారింది. 786 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. ఊహకు అందని విధంగా పెరిగింది, బీబీఎంపీని 7 నగర పాలికెలుగా విభజించాలి. పాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధి కోసం ఇది ఆవశ్యకం.
గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు నిర్దిష్ట కాలపరిమితిలో సాధ్యమా అనేది పరిశీలించాలి.
ప్రాధికార సభ్యుల జాబితాలో కలెక్టర్, ఎస్పీలను చేర్చాలి.
ప్రతి పాలికెలో వార్డులు సమానంగా ఉండాలి. ఒక్కో పాలికెలో వార్డులు 200 కు మించరాదు, 100 కంటే తక్కువ ఉండరాదు
ప్రతి ఏడాది జూన్‌నెలలో సభ్యులు ఆస్తి ప్రకటన చేయాలి. ఒకరు ఒకవార్డులో మాత్రమే పోటీ చేయాలి.
ఎన్నికల్లో గెలిచిన సభ్యుడు ఓటరు జాబితాలో మార్పులు చేసుకోరాదు. మార్పు చేస్తే సభ్యత్వం కోల్పోయేలా ఉండాలి.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవీకాలం 30 నెలలు ఉండాలి.
నగర పాలికెలు విధించే పన్నులు, ఇతర సుంకాలు, వినియోగదారులు శుల్కం విషయంలో గ్రేటర్ జోక్యం చేసుకోరాదు.
34 వేల ఎకరాల ఆలయ భూముల కబ్జా
34 వేల ఎకరాల ఆలయ భూముల కబ్జా
34 వేల ఎకరాల ఆలయ భూముల కబ్జా
Comments
Please login to add a commentAdd a comment