సిద్దు సర్కారుపై బీజేపీ రణభేరి
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పథకాల పేరుతో ఎస్సీ ఎస్టీల నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. బుధవారం నగరంలోని ఫ్రీడం పార్కులో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, నాయకులు, కార్యకర్తలతో సభ జరిపారు. విజయేంద్ర మాట్లాడుతూ సిద్దరామయ్య సర్కారు శ్రమజీవులకు ఆర్థిక శక్తినిచ్చి వారిని అభివృద్ధిపరిచే పనులు చేయడం లేదన్నారు. ఒక మతం వారిని మెప్పించేందుకు ప్రయత్నిస్తూ ఇతరులకు అన్యాయం చేస్తోందన్నారు. పేదల కడుపు కొట్టడం మానుకోవాలన్నారు.
సిద్దు సర్కారుపై బీజేపీ రణభేరి
Comments
Please login to add a commentAdd a comment