ఫెమినా షోకేస్‌లో... డ్యూక్
గూర్గావ్‌లోని అంబియాన్స్ మాల్లో ఇటీవల జరిగిన ‘ఫెమినా షో’లో ప్రదర్శించిన డ్యూక్ ఫ్యాషన్ డిజైన్లు ఆకట్టుకున్నాయి. దాదాపు 8 వేల మంది ప్రేక్షకులుగా విచ్చేసిన ఈ షోలో డ్యూక్ డిజైన్లు ఫ్యాషన్ ప్రియులను అలరించాయి. టీ-షర్ట్స్, షర్ట్స్, జీన్స్, లగేజ్ వేర్, షార్ట్స్, లేడీస్ షార్ట్స్‌కు సంబంధించి అత్యాధునిక డ్యూక్ డిజైన్లు ఫెమీనా షోలో ప్రదర్శించారు. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించి గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా డిజైన్ల రూపకల్పన జరుగుతుందని బ్రాండ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.