festival of india
-
లండన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
లండన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ‘ఇండియన్ ఫ్రెండ్స ఇన్ లండన్’ ఆధ్వర్యంలో బ్రెంట్వుడ్లో జరిగిన వేడుకల్లో సుమారు వందలాది మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి శ్రీనివాస డబ్బీరు, ప్రముఖ వ్యాపారవేత అయ్యప్ప గార్లపాటి మాట్లాడుతూ..భారతీయులు అందరు కలిసి దీపావళి జరుపుకోవటం చాల సంతోషంగా ఉందని అన్నారు. కార్యవర్గ సభ్యులు శ్రీలక్ష్మి వేముల, రుద్ర వర్మ బట్ట ,శ్రీనివాస రెడ్డి, చెన్న రావు వేము, నరేంద్ర మున్నలూరి , శిరీష డబ్బీరు , విరిత, హైమ కార్యక్రమ ఏర్పాట్లు చేశారు -
బ్రెజిల్లో పది రోజులపాటు ఇండియన్ ఫెస్టివల్
రియో డి జనీరో : బ్రెజిల్లో పది రోజుల పాటు ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొన్ని ప్రదర్శనలు జరుగుతాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న భారత్ సంస్కృతి, సంప్రదాయాలు, గొప్పతనాన్ని బ్రెజిల్ రాజధాని రియో డీ జనీరో నగరంతో పాటుగా బ్రసీలియా, సావో పాలోలో భారత శాస్త్రీయనృత్యాలు, సాహిత్యంతో మహాత్మాగాంధీకి సంబంధించిన విషయాలపై ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇండియన్ ఫెస్టివల్ వివరాలివి.. ఆగస్ట్ 31- సెప్టెంబర్ 4 తేదీల మధ్య తన బృందంతో కలిసి దేవయాని భరతనాట్య ప్రదర్శన సెప్టెంబర్ 1 నుంచి 5 తేదీ వరకూ నందిని సింగ్ తన బృందంతో కలిసి కథక్ నృత్య ప్రదర్శన సెప్టెంబర్ 3 నుంచి 9 తేదీ వరకూ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ సెప్టెంబర్ 5 నుంచి 9 తేదీ వరకూ సాహిత్య వేడుకలు ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించి ఎగ్జిబిషన్ -
ఆస్ట్రేలియన్లను అలరించనున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
మెల్బోర్న్: భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, కళాకారుల నైపుణ్యాన్ని చాటడానికి మొదటిసారిగా ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, కాన్బెర్రా తదితర ప్రధాన నగరాల్లో ఆగస్టులో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని భారత హైకమిషనర్ నవ్‌దీప్ సూరి వెల్లడించారు. నాలుగు నెలలపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు, సంగీతంతోపాటు భారతీయ కళలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఆస్ట్రేలియా, ఇండియా ప్రభుత్వాలతోపాటు పలు ప్రైవేటు సంస్థల సహాయంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రదర్శనలు ఉంటాయని, ఒడిషా నర్తకి సుజతా మహాపాత్ర, రఘు దీక్షిత్ సంగీతం, అజిత్ నియాన్ కార్టూన్ ఎగ్జిబిషన్, తోలుబొమ్మలాట వంటివి ఆస్ట్రేలియన్లను అలరిస్తాయని చెప్పారు. ఈ ఉత్సవం అధికారికంగా వచ్చే నెలలో సిడ్నీలో ప్రారంభమవనుంది. -
కుసుమాల కూర్పు