రియో డి జనీరో : బ్రెజిల్‌లో పది రోజుల పాటు ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొన్ని ప్రదర్శనలు జరుగుతాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న భారత్ సంస్కృతి, సంప్రదాయాలు, గొప్పతనాన్ని బ్రెజిల్ రాజధాని రియో డీ జనీరో నగరంతో పాటుగా బ్రసీలియా, సావో పాలోలో భారత శాస్త్రీయనృత్యాలు, సాహిత్యంతో మహాత్మాగాంధీకి సంబంధించిన విషయాలపై ఫెస్టివల్ నిర్వహిస్తారు.
ఇండియన్ ఫెస్టివల్ వివరాలివి..
- ఆగస్ట్ 31- సెప్టెంబర్ 4 తేదీల మధ్య తన బృందంతో కలిసి దేవయాని భరతనాట్య ప్రదర్శన
- సెప్టెంబర్ 1 నుంచి 5 తేదీ వరకూ నందిని సింగ్ తన బృందంతో కలిసి కథక్ నృత్య ప్రదర్శన
- సెప్టెంబర్ 3 నుంచి 9 తేదీ వరకూ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ
- సెప్టెంబర్ 5 నుంచి 9 తేదీ వరకూ సాహిత్య వేడుకలు
- ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించి ఎగ్జిబిషన్