వీరనారి.. ఐలమ్మ
- ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలి
- పాలకుర్తిలో వర్థంతి వేడుకలు
- నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
పాలకుర్తి టౌన్ : వీరనారి ఐలమ్మ భూపోరాటం చారిత్రకమైంది.. ఆమె విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రాంచంద్రం, సీపీఎం మండల కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా అన్నారు. ఐలమ్మ 29వ వర్ధంతిని పుస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని ఆమె స్మారక స్థూపం వద్ద సీపీ ఎం, విగ్రహపత్రిష్ఠ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విస్నూరు దేశ్‌ముఖ్ ఆగడాలను ఎదిరించిన వీరవనిత ఐలమ్మ పోరాటాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఆమె ఉద్యమ స్ఫూర్తితో ప్రతి నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐలమ్మతోపాటు దొడ్డి కొమురయ్య, షేక్ బందగి కాంస్య విగ్రహలను ట్యాంక్ బాండ్‌పై ఏర్పా టు చేయాలని, యూనివర్సిటీలకు వారి పేర్లు పెట్టాల న్నారు. జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారి కంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వీరతెలంగా ణ ఉద్యమంలో నాలుగువేల మంది అమరులయ్యారని, 10లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జీడీ సోమయ్య, కె.కుమారస్వామి, చిట్యాల సమ్మయ్య, కొంతం కొముర య్య, జీడి సత్యనారాయణ, కొమురుమల్లు,సెక్రటరీ యాకయ్య, వెంకన్న, చిట్యాల యాకయ్య, మామిండ్ల సోమచందర్, దాసరి యాదగిరి, చిదురాల ఎల్లయ్య, ఐలమ్మ కుటుంబ సభ్యులు, దాసరి యాదగిరి, చిదురాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ పోతుగంటి నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్రాజాతోపాటు తెలుగు ఉపాధ్యాయుడు పి.బాలమల్లు మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఐలమ్మ పోరాట చరిత్ర తెలుసుకోవాల న్నారు. కార్యక్రమంలో పోషబోయిన రవి, డి.వెంకటేశ్వర్లు, కె.సోమయ్య, గందె రమేష్, టి.కమలాకర్, జానకి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.