Film Academy
-
రామానాయుడు ఫిలిం స్కూల్లో కౌన్సిలింగ్ ఫౌండేషన్ కోర్సు !
మానవుని దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో సంపాదన పరుగులో మనిషికి మానసిక ప్రశాంతత దారుణంగా కరువయ్యిందనే చెప్పాలి. అందుకోసం తాను ఏం చేయాలన్నది కూడా స్ప్రుహ లేనంత గందరగోళంలో ఉన్నాడు. దీంతో సమస్యలన్నీ ఒక పెనుభూతంలా కనిపించి ఎదుర్కొనే స్థైర్యం లేక నిసత్తువుగా మారిపోతున్నాడు. విద్యార్థుల నుంచి పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు అందర్ని వేధిస్తున్న సమస్యే ఈ మానసిక అనారోగ్యం.దీన్ని మెరుగుపరుచుకుని మనల్ని మనం సంసిద్ధం చేసుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలానే రామానయుడు ఫిల్మ్ స్కూల్ ముందుకొచ్చింది. ఈ మేరకు గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషన్, ముదిత ట్రైబ్ ఫౌండేషన్ల సహకారంతో రామా నాయుడు ఫిల్మ్ స్కూల్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నో కాస్ట్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పర్సన్-టు-పర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సెలింగ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఆయా వ్యక్తులు సహ కౌన్సిలర్లుగా మారి తమ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే స్థాయికి చేరేలా ఈ కోర్సుని రూపొందించారు.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్ నో కాస్ట్ ఫౌండేషన్ కోర్సు రామానాయుడు ఫిలిం స్కూల్లో ఇవాళ మే 1 నుంచి ప్రారంభమై మే 6, 2024 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజుల ఫౌండేషన్ కోర్సు కోసం సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్ల డిమాండ్ ఎక్కువయ్యిందని గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషకి చెందిన శ్రీనివాసన్ లింగేశ్వరన్ అన్నారు. ఆ డిమాండ్‌ని తీర్చే ఉద్దేశ్యంతోనే ఈ కోర్సుని రూపొందిచడం జరిగిందని చెప్పారు. ఇది కేవలం కౌన్సిలర్ల కొరత సమస్యను పరిష్కరించడమే కాకుండా మానిసిక ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పించేలా ప్రాధాన్యత ఇచ్చేలా చేసి సంపూర్ణ సంక్షేమ నిబద్ధతకు పెద్ద పీట వేస్తుంది. ఈ మేరకు ముదిత వ్యవస్థాపకురాలు మిహీకా దగ్గుబాటి మాట్లాడుతూ..ఎటువంటి ఖర్చు లేకుండా వారివారీ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా శక్తిమంతంగా చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇలాంటి కోర్సులు నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయని రామానాయుడు పిల్మ్ స్కూల్ చైర్మన్ డి సురేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యాసకులకు ఇద్దరూ ప్రఖ్యాత మనస్తత్వవేత్తలు కౌన్సిలింగ్ ద్వారా మాసిక ఆరోగ్యంపై లోతైన అవగాహానను, ఆచరణాత్మక పద్ధతుల గురించి కూలంకషంగా తెలియజేస్తారు. ఈ కోర్సులో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలన్నింటిని నిపుణులు కవర్ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే గాక ఇతరులను ప్రభావితం చేసేలా కౌన్సిలర్లుగా మారి సంతోషకరమైన సమాజానికి బాటలు వేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఉజ్వల భవిష్యత్తు దిశగా ఇవాళ నుంచే తొలి అడుగులు వేద్దాం. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!) -
శిక్షణ పొందిన అకాడమీ విద్యార్థులతో కొత్త సినిమా..
చైన్నై సినిమా: ఫిల్మ్ అకాడమీ విద్యార్థుల కోసం చిత్ర నిర్మాణం చేపట్టడం అనే కొత్త ప్రయత్నానికి డీసెల్స్ ఇంటర్నేషనల్ ఫిలీం మీడియా శ్రీకారం చుట్టింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం తదితర శాఖల్లో శిక్షణ ఇస్తున్న ఈ అకాడమీ తమ స్టూడెంట్స్ కోసం ఏడాదిలో చిత్రాన్ని నిర్మించనుంది. మొదటి ప్రయత్నంగా ఈ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ 'అట్టై తింగళ్ అన్ని లవిల్' అనే వైవిధ్య భరిత ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు. తాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్సి. అయ్యప్పన్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎస్ఎస్ జయకుమార్ వారన్ నిర్వహించారు. ఈయన గతంలో దర్శకుడు కె. భాగ్యరాజ్, ఎస్‌జె సూర్య, తిరుమురుగన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. చదవండి:👇 తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. మరో నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు ఒకేసారి రిపీట్ కానున్న 10 జంటలు.. -
ఫిల్మ్ అకాడమీల కన్న... పెద్దల మాట మిన్న!
గ్లామర్ పాయింట్ ‘ది న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ’లో నటనలో శిక్షణ తీసుకుంది ప్రముఖ డెరైక్టర్ ఇంద్ర కుమార్ కుమార్తె శ్వేత కుమార్. ఆరోజుల్ని ఒకసారి గుర్తుకు తెస్తే- ‘‘ఏమాటకామాట చెప్పుకోవాలి. అక్కడ నేర్చుకున్నదానికంటే పెద్దల సలహాల నుంచి నేర్చుకుందే ఎక్కువ’’ అంటుంది ఆమె. ‘సూపర్ నాని’ సినిమాలో భాగంగా రేఖ, రణ్‌ధీర్ కపూర్‌లాంటి సీనియర్లతో పని చేసే అవకాశం వచ్చింది శ్వేతకు. ఆ సమయంలో నటనకు సంబంధించి వారెన్నో సలహాలు ఇచ్చారట. ముఖ్యంగా ఎమోషనల్ సీన్‌ను ఎలా పండించాలి అనేదాని గురించి బోలెడు టిప్పులు ఇచ్చారట. పర్ఫెక్షన్ కోసం రేఖ పడే తపన శ్వేతను ఆకట్టుకుంది. వీలైనప్పుడల్లా అరుణా ఇరానీ సలహాలు కూడా అడుగుతుంది శ్వేత. ఒకసారి ఇరానీ ‘‘మీ నాన్న డెరైక్టర్ కాబట్టి సినిమాల్లోకి రావాలనుకోకు. నటన మీద పాషన్ ఉంటే మాత్రమే వచ్చేయ్’’ అన్నారట. శ్వేత మాటల్లో కనిపించే అంకితభావం చూస్తుంటే ఆమె ఆషామాషీగా సినిమా రంగంలోకి రాలేదనే విషయం అర్థమవుతుంది. శ్వేతకు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో పనిచేసే అవకాశం రావాలని ఆశిద్దాం.