Film Nagar Cultural Centre
-
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన FNCC సభ్యులు
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు తాజాగా సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ప్రెసిడెంట్ ఆదిశేష గిరి, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో పాటుగా ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్‌కు FNCC ప్రెసిడెంట్, సెక్రటరీ పుష్పగుచ్చము ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ప్రొడ్యూసర్, FNCC సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి FNCCకి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. FNCC ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితుల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. FNCC కి తన వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఆయన తెలియచేశారు. ఇలా తనను ఆహ్వానించి గౌరవించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులే గెలుపొందారు. చదవండి: (డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్) -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద హైడ్రామా
ఈ నెల 24న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించి బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఈ కేసులో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు, కార్యదర్శి బి.రాజశేఖర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు 24 గంటల్లోపు విచారణకు తమ ముందు హాజరుకావాలని మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల్లోపు వీరిద్దరూ బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే కే.ఎస్.రామారావు, రాజశేఖర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో హాజరవుతున్నారని ప్రచారం జరగడంతో మీడియా లైవ్ వాహనాలతో ఇక్కడవాలింది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రామారావు, రాజశేఖర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు రాలేదు. దీంతో తదుపరి చర్యలు ఏంటన్నదానిపై పోలీసులు ఆలోచనలోపడ్డారు. మళ్లీ 41(ఏ) కింద రెండో నోటీసు జారీ చేయాలా లేకపోతే డెరైక్ట్‌గా అరెస్ట్ చేయాలా అన్నదానిపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ఫోన్లు రెండు రోజుల నుంచి స్విచ్ఛాఫ్ ఉండటంతో పాటు పోలీసులకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నోటీసులను ఇళ్లముందు అంటించి వచ్చారు. ఇంకోవైపు చిరంజీవితో పది సినిమాలు తీసిన తాను స్టేషన్‌కు వచ్చి అరెస్టు అయితే తన ఇజ్జత్ ఏం నిలుస్తుందని కే.ఎస్.రామారావు తన్న సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.