financial market
-
ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఇందుకు వాటాదారులు, రుణదాతలు తాజాగా ఆమోదముద్ర వేశారు. తొలుత రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్) పేరుతో విడదీయనున్న కంపెనీని తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసులుగా మార్పు చేయనున్నారు. వాటాదారుల సమావేశంలో ఈ ప్రతిపాదనకు 99.99 శాతం ఓట్లు లభించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. కాగా.. ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ రూ. 10 ముఖ విలువగల ఆర్ఎస్ఐఎల్ షేరును జారీ చేయనున్నారు. తదుపరి ఆర్ఎస్ఐఎల్.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్)గా ఆవిర్భవించనుంది. సెప్టెంబర్‌కల్లా లిస్టింగ్ జెఫరీస్ రీసెర్చ్ వివరాల ప్రకారం జేఎఫ్ఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో సెప్టెంబర్‌కల్లా లిస్ట్‌కానుంది. ఇందుకు అప్పటికల్లా అన్ని అనుమతులూ లభించగలవని అభిప్రాయపడింది. కంపెనీ వెనువెంటనే రుణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. అసెట్ మేనేజ్మెంట్, జీవిత, సాధారణ బీమా విభాగాలకు నియంత్రణ సంస్థల అనుమతులను కోరనుంది. వీటిని 12–18 నెలల్లోగా పొందే వీలున్నట్లు జెఫరీస్ పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసేందుకు గతేడాది అక్టోబర్‌లో ఆర్ఐఎల్ గ్రూప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఐఎల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఐఎల్ వ్యవహరిస్తోంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై డిపాజిట్లు సమీకరించని ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీగా కొనసాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.2 శాతం బలపడి రూ. 2,448 వద్ద ముగిసింది. కామత్‌కు బాధ్యతలు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కేవీ కామత్‌ను జేఎఫ్‌ఎస్‌ఎల్‌కు నాన్ఎగ్జిక్యూటివ్గా చైర్మన్‌గా ఆర్ఐఎల్ ఎంపిక చేసింది. 2021–22లో ఈ విభాగం రూ. 1,536 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 27,964 కోట్ల సంయుక్త ఆస్తులను కలిగి ఉంది. బ్రోకింగ్ సంస్థ మెక్వారీ వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకుపైనే. దేశీయంగా ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థగా నిలవనుంది. -
స్విస్ సెంట్రల్ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దావా
లండన్: క్రెడిట్‌సూసే ఇన్వెస్టర్ల బృందం స్విస్ స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్ వైజరీ అథారిటీ (ఎఫ్‌ఐఎన్‌ఎంఏ/స్విస్ సెంట్రల్ బ్యాంక్)కి వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. గత నెలలో సంక్షోభంలో పడ్డ క్రెడిట్ సూసేని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా 16 బిలియన్ స్విస్ఫ్రాంకోలు (17.3 బిలియన్ డాలర్లు) విలువైన బాండ్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. క్రెడిట్ సూసేని యూబీఎస్ 3.25 బిలియన్ డాలర్లకు కొనడం తెలిసిందే. ఇదంతా కేంద్ర బ్యాంకు మార్గదర్శకంలోనే జరిగింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న క్రెడిట్‌సూసే మునిగిపోకుండా కాపాడినట్టయింది. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంతో క్రెడిట్‌సూసే సంక్షోభం పాలైంది. ఎఫ్‌ఐఎన్‌ఎంఏ తీసుకున్న నిర్ణయం స్విస్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వసనీయత, కచ్చితత్వాన్ని దెబ్బతీసిందని లా సంస్థ క్విన్ ఎమాన్యుయేల్ అర్కుహర్ట్ మేనేజింగ్ పార్ట్నర్ థామస్ వెర్లెన్ తెలిపారు. ఇన్వెస్టర్ల తరఫున ఈ సంస్థే వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టును ఆశ్రయించిన ఇన్వెస్టర్లు సంయుక్తంగా 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను బాండ్లలో కలిగి ఉన్నారు. -
ఎన్‌బీఎఫ్‌సీల కోసం క్యాష్‌ఫ్రీ డిజిటల్ సొల్యూషన్
హైదరాబాద్: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), వాటి భాగస్వామ్య సంస్థల కోసం కొత్తగా డిజిటల్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సీఈవో ఆకాష్ సిన్హా తెలిపారు. రుణ వితరణ, వసూళ్ల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సొల్యూషన్స్ పని చేస్తుందని సిన్హా వివరించారు. రుణగ్రహీత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నేరుగా రుణ గ్రహీత ఖాతాలోకే రుణాల బదలాయింపు మొదలైనవి దీనితో సులభతరం అవుతాయని పేర్కొన్నారు. -
మార్కెట్ నిపుణుల కోసం ఎన్ఎస్ఈ అకాడెమీ
హైదరాబాద్‌లోనూ కోర్సులు ముంబై: ఫైనాన్షియల్ మార్కెట్లో నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని... అలాంటి వారిని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ ‘ఎన్ఎస్ఈ’ తాజాగా ఒక అకాడెమీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఈ కొత్త అకాడె మీ ద్వారా ఔత్సాహికుల కోసం పలు ఫైనాన్షియల్ కోర్సులను అందుబాటులో ఉంచింది. తొలిగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించి 11 నెలల పోస్ట్ గ్రాడ్యు యేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. రెగ్యులర్ తరగతులు జూలై 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ అకాడె మీ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉంది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
అమెరికాలో వడ్డీ రేట్లపై తర్జన భర్జన
-
అడ్డంకులు ఎదురైనా... అధిగమిస్తున్నాం: శర్మ
ఇటీవలి ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభం సందర్భంగా భారత్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ శనివారం పేర్కొన్నారు. అయితే దేశం ఇబ్బందుల నుంచి సమర్థవంతమైన రీతిలోనే కోలుకుంటోందని ఆయన వివరించారు. ప్రధాని మన్మో హన్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన శర్మ, భారత్‌కు తిరుగు ప్రయాణమవుతూ పీఎం స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విలేకరులతో మాట్లాడారు.