మార్కెట్ న్యూస్ కోసం ట్విట్టర్ డీల్
న్యూయార్క్ : లైవ్ స్ట్రీమ్ సర్వీసులపై మైక్రోబ్లాగింగ్ వైబ్ సైట్ ట్విట్టర, మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ మధ్య ఒప్పందం కుదిరింది. ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై వివిధ మీడియా కంపెనీల టీవీ షోలు వీక్షించే విధంగా ఈ డీల్ పై సంతకాలు జరిగాయి. "బ్లూమ్ బర్గ్ వెస్ట్", "వాట్ డూ యు మిస్?", "విత్ ఆల్ డ్యూ రెస్పెట్" వంటి షోలతో పాటు, నెట్ వర్క్స్ డైలీ స్టాక్ మార్కెట్ కవరేజ్ స్ట్రీమింగ్ హక్కులను ట్విట్టర్ పొందింది. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య భాగస్వామ్యం కుదిరింది. అయితే ఈ డీల్ మొత్తం విలువను కంపెనీలు ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు కంపెనీలు అడ్వర్ టైజింగ్ రెవెన్యూలను పంచుకోనున్నాయని మాత్రం టెక్నాలజీ వెబ్ సైట్ టెక్ క్రంచ్ బుధవారం నివేదించింది.
బ్లూమ్ బర్గ్ భాగస్వామ్యంతో ఫైనాన్సియల్ మార్కెట్ల పనితీరును లైవ్ గా ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై చూడటానికి వీలవుతుందని, అలాగే మార్కెట్ విశ్లేషకుల కమెంటరీని కూడా లైవ్ గా వినొచ్చని ట్విట్టర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఆంటోని నోటో ఓ ప్రకటనలో తెలిపారు. గ్లోబల్ బిజినెస్ లో, ఫైనాన్సియల్ మార్కెట్లో ఏం జరుగబోతుందో తెలుసుకోవడానికి ట్విట్టర్ మరింత వేగవంతమైన సాధనంగా, లైవ్ కమెంటరీకి ఇది ఓ ముఖ్యమైన సాధనంగా రూపొందనుందని నోటో పేర్కొన్నారు.
ట్విట్టర్ ఈ వారంలోనే అమెరికా టెలివిజన్ నెట్ వర్క్ సీబీఎస్ తో డీల్ కుదుర్చుకుంది. ప్రజాస్వామ్య జాతీయ సమావేశాల షెడ్యూల్ ను ఈ నెల చివరి నుంచి ట్విట్టర్ లో లైవ్ గా అందించబోతోంది. 24 గంటల డిజిటల్ న్యూస్ స్ట్రీమింగ్ సర్వీసు ద్వారా సీబీఎస్ఎన్ ఫీడ్ ను ఆన్ లైన్ లో ఉచితంగా బ్రాడ్ కాస్ట్ చేయడానికి ఆమోదం లభించింది. 10ఎన్ఎఫ్ఎల్ గేమ్స్ ను ఈ ఏడాది చివరి నుంచి ట్విట్టర్ లైవ్ గా అందించనుంది. ఈ గేమ్స్ కు సీబీఎస్ పార్టనర్. గతవారమే ప్రత్యక్ష వింబుల్డన్ కవరేజ్ ను ట్విట్టర్ అందించింది. ప్రస్తుతం ఎన్ బీఏ, మేజర్ లీగ్ సాసర్, టర్నర్ వంటి వాటితో స్ట్రీమింగ్ రైట్ల కోసం ట్విట్టర్ సంప్రదింపులు కొనసాగిస్తోంది.