financial year 2013-14
-
13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు
దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (cbdt) తెలిపింది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరగ్గా... అందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్లు జారీ అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్ల కంటే 59.44 శాతం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష పన్నుల బోర్డ్ పేర్కొంది. Gross Direct Tax collections for FY 2022-23 upto 10th March, 2023 are at Rs. 16.68 lakh crore, higher by 22.58% over gross collections for corresponding period of preceding yr. Net collections at Rs. 13.73 lakh crore are 16.78% higher than net collections for same period last yr pic.twitter.com/wtxMsqm1LG — Income Tax India (@IncomeTaxIndia) March 11, 2023 స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత, సీటీఐ (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్)తో సహా పీఐటీ (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లు 20.06 శాతంగా ఉంది. -
ఏటీఎంల ఏర్పాటు లక్ష్యం కష్టమే..
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2013-14) ముగిసేసరికి బడ్జెట్లో ప్రతిపాదించిన ఏటీఎంల ఏర్పాటు కష్టసాధ్యమే! ఒక్కో బ్రాంచీకి కనీసం ఒక్కో ఏటీఎం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ 2014 మార్చి 31కల్లా ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు మొత్తం 72,340 ఏటీఎంలను కలిగి ఉండాలి. కానీ 2013 మార్చి చివరికి ఏటీఎంల సంఖ్య 37,672గా నమోదుకావడంతో వీటిని దాదాపు రెట్టింపు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా 2013-14 బడ్జెట్లో 34,668 ఏటీఎంలను కొత్తగా ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే డిసెంబర్ ముగిసేసరికి పీఎస్‌యూ బ్యాంకులు 14,885 ఏటీఎంలను మాత్రమే కొత్తగా నెలకొల్పగలిగాయి. అంటే తొలి 9 నెలల లక్ష్యమైన 25,950 ఏటీఎంలలో ముప్పావువంతును మాత్రమే అందుకోగలిగాయి. వెరసి చివరి 3 నెలల్లో మరో 19,813 ఏటీఎంలను ఏ ర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్బీఐ వెనకడుగు: ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్బీఐ డిసెంబర్‌కల్లా 2,266 ఏటీఎంలను మాత్రమే కొత్తగా ఏర్పాటు చేయడంతో, మార్చి ముగిసేసరికి మరో 2,221 ఏటీఎంలను నెలకొల్పాల్సిన పరిస్థితి. కాగా, లక్ష్యానికి అనుగుణంగా ఏటీఎంల ఏర్పాటు విషయంలో బీవోబీ, ఐడీబీఐ, విజ యా బ్యాంక్ బాగా ముందు నిలవడం విశేషం! బీవోబీ 2, ఐడీబీఐ 32, విజయా బ్యాంక్ 39 ఏటీఎంలను మాత్రమే కొత్తగా నెలకొల్పాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో మొత్తం 26 బ్యాంకులు ఉన్నాయి.