fingernails
-
దడదడలాడించే వ్యాధి..! సరైన చికిత్స సైతం..
రోడ్డును తొలిచే దగ్గరో లేదా కొత్తగా ఇల్లు కట్టే చోట రాతిని బద్దలు చేయడానికి వాడే మెకానికల్ గడ్డపలుగు / గునపం లాంటివి వాడినప్పుడు అది దడదడలాడుతూ చేతులను వణికిస్తుంటుంది. ఆన్ చేసిన ట్రాక్టర్ స్టీరింగుపై చేతులు ఆన్చినా అదీ చేతుల్ని దడదడలాడిపోయేలా చేస్తుంది. ఇలాంటి పరికరాలు చాలాకాలం వాడుతూ ఉండే వృత్తుల్లో ఉన్నవాళ్లలో కొందరికి వచ్చే జబ్బు పేరే ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’. కేవలం అలాంటి గడ్డపలుగు మాత్రమే కాదు... పవర్ డ్రిల్స్, జాక్ హ్యామర్స్, పెద్ద పెద్ద చెట్లను నరికేసే చైన్ సాల వంటి వాటిని వాడేవారిలోనూ ఇది రావడం సహజం. ఈ జబ్బుకు ‘హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (హావ్స్) అనీ, డెడ్ ఫింగర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ‘రేనాడ్స్ డిసీజ్’ అనే రక్తనాళాలలనూ, నరాలను దెబ్బతీసే ఒక కండిషన్ తాలూకు తర్వాతి రూపం (సెకండరీ ఫార్మ్) అని కూడా భావిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల్లో ‘వైట్ ఫింగర్ డిసీజ్’కు తోడ్పడే జన్యువును సైతం ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’ ప్రధానంగా వేళ్లలోని రక్తనాళాలు, నరాలు, కండరాలూ, కీళ్లతో పాటు చేతులు, మణికట్టు వంటి వాటిపై తన దుష్ప్రభావం చూపుతుంది. మొదట్లో వేళ్ల చివర్లు తిమ్మిరిగా అనిపిస్తాయి. అటు తర్వాత అవి తెల్లగా పాలియినట్లుగా అవుతాయి. జబ్బు తీవ్రత బాగా పెరిగినప్పుడు వేళ్లు వేళ్లన్నీ తెల్లగా మారిపోతాయి. అందుకే ఈ జబ్బుకు ‘వైట్ ఫింగ్ డిసీజ్’ అని పేరు. అయితే... అలా తెల్లగా మారిన కొద్దిసేపటి తర్వాత రక్తం వేళ్ల చివరికి వేగంగా ప్రవహించడం వల్ల అవి ఎర్రగా కూడా మారవచ్చు. ఒకసారి వచ్చిందంటే... ఆ తర్వాత అత్యంత త్వరలోనే తాము చేసే పనిని మానేయాల్సిన (రిటైర్ అవ్వాల్సిన) పరిస్థితి ఉంటుంది. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడుతున్నప్పటికీ... దీనికి సరైన చికిత్స అంటూ నిర్దిష్టంగా ఏదీ లేదు. అందుకే తీవ్రంగా / విపరీతంగా కంపిస్తూ పనిచేసే ఉకపరణాలతో పనిచేసేవారు తమ పని గంటలను తగ్గించుకుంటూ రావడమే ఓ మంచి నివారణ చర్య. (చదవండి: యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..? వేటిలో ఉంటాయంటే..!) -
చెరిగిపోని సిరాచుక్క
చూపుడువేలిపై సిరా చుక్క. ఓటేశామని చెప్పేందుకు తిరుగులేని గుర్తు. పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే చూపుడువేలిపై సిరా చుక్కను చూపిస్తూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఆ ఇంకు కథ ఆసక్తికరం. ప్రపంచవ్యాప్తంగా.. మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటినుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా. ఇదీ ప్రత్యేకత... ► ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తా రు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది. ► సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది. ► 5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లు ఆర్డర్ చేసింది. ► మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
గోళ్లు విరిగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
వర్షాకాలంలో అధికంగా ఉండే తేమకు గోళ్లు విరిగిపోతుంటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం మరింత సున్నితంగా మారి పాడవుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే... రాత్రి పడుకునే ముందు సైంధవ లవణం వేసిన నీటిలో పది నిమిషాలపాటు వేళ్లను నానబెట్టాలి. తరువాత తడిలేకుండా తుడిచి క్రీమ్ రాసుకుని సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పెళుసుబారకుండా ఉండటంతోబాటు గోళ్ల చుట్టూ ఉన్న చర్మం మృదువుగా మారుతుంది. ఆలివ్ ఆయిల్లో గోళ్లను మర్దన చేస్తే మరింత షైనింగ్‌గా కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను వేడిచేసి గోళ్ల మీద వేసి మర్థన చేయాలి. మర్దన తరువాత నీటితో కడిగేయాలి. రోజుకి రెండు సార్లు ఇలా చేయడం వల్ల గోళ్లు మరింత అందంగా మెరుస్తాయి. గోరు చుట్టూ ఉన్నచర్మానికి క్యూటికల్ సమస్య బాధిస్తుంటే తేనె రాసి మర్దన రాసి చేయాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగి తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యూటికల్ తగ్గు ముఖం పడుతుంది. పచ్చిపాలలో ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లు, చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోజూ రాత్రి పడుకునేముందు పచ్చిపాలలో చేతివేళ్లను పదినిమిషాలపాటు నానపెట్టి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో గోళ్లు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. -
మర్రి ఊడలు కాదు.. చేతిగోళ్లు!
► గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కిన అయానా విలియమ్స్ ► 23 ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిందన్న మహిళ వాషింగ్టన్: మర్రి ఊడలను తలపించేలా చేతివేళ్ల గోళ్లను భారీగా పెంచేశారు అమెరికాకు చెందిన మహిళ. పొడవాటి గోళ్లతో ఫొటోలకు ఫొజిస్తోన్న ఆమె పేరు అయానా విలియమ్స్. రెండు దశాబ్దాలకు పైగా ఆమె పడ్డ శ్రమకు నేడు తగిన గుర్తింపు దక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 2018లో ఆమె తన పేరు లిఖించుకున్నారు. రెండు చేతులవేలిగోళ్లు అతిపొడవుగా ఉన్న కేటగిరీ (మహిళలు)లో అయానా ఈ ఘనత సాధించారు. టెక్సాస్ కు చెందిన అయానా గత 23 ఏళ్ల నుంచి పడ్డ శ్రమ వృథాకాలేదని చెబుతారు. ఆమె చేతివేలి గోళ్ల మొత్తం 576.4 సెంటీమీటర్లున్నాయి. 18 అడుగుల 10.9 ఇంచుల పొడవైన గోళ్లున్నప్పటికీ అయానా తన పనులు తానే చేసుకుంటూ అందర్నీ అశ్చర్యానికి లోను చేస్తున్నారు. గోళ్లను ప్రతిరోజు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో శుభ్రం చేయడంతో పాటు నెయిల్ బ్రష్ కు కాస్త పనిచేబుతానని ఆమె గర్వంగా చెబుతున్నారు. తాను కష్టపడి కాదు ఇష్టపడి చేసినందువల్ల.. 23 ఏళ్లపాటు చేతుల వేలిగోళ్లను పెంచుతూ కాపాడుకోవడం ఇబ్బంది అనిపించలేదన్నారు. అయితే కొన్ని పర్యాయాలు దుస్తులు వేసుకునే సమయంలో మాత్రమే తనకు కాస్త కష్టమనిపించేదని వివరించారు. -
మర్రి ఊడలు కాదు.. చేతిగోళ్లు!