రూ. 8.85 కోట్ల ఆస్తులు పంపిణీ
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న చేతుల మీదుగా రూ.8 కోట్ల 85 లక్షల 44 వేల 600 విలువైన ఆస్తులు పంపిణీ చేశారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 53 మంది లబ్ధిదారులకు రూ.56 లక్షల విలువైన ఆటోరిక్షాలు, వీడియో కెమెరాలు, జిరాక్స్ తదితర రుణాలు అందించారు.
అల్పాసంఖ్యక వర్గాల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో రూ. 6లక్షల విలువ చేసే 4 మంది లబ్ధిదారులకు 2 ఆటోలు, 2 టైలరింగ్ సెంటర్లు అందించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు మంది లబ్ధిదారులకు రూ.లక్ష 59 వేలు అందజేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగ-సకలాంగుల వివాహాలు చేసుకున్న వారికి, ట్రైసైకిల్, రుణాలు 28 మందికి రూ.12 లక్షల 20 వేలు అందజేశారు. డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు రూ.4 కోట్ల 73 లక్షల 7 వేల రుణాలు మం త్రి చేతుల మీదుగా అందించారు. డ్వామా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రూ.7 లక్షలు అందజేశారు.
మెప్మా శాఖ అధికారులు రూ.4 కోట్ల ఆస్తులు పంపిణీ చేశారు. హార్టికల్చరల్ శాఖ ఆధ్వర్యంలో రూ. 3 లక్షల 7 వేల ఆస్తులు, మైనార్టీ వెలే ్ఫర్ రూ.4 లక్షల ఆస్తులు పంపిణీ చేశారు. రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో అర్హులైన 11 మంది విద్యార్థులకు రూ.43 వేల 6 వందల విలువైన వినికిడి యంత్రాలు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, రోలేటర్స్ను పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కులాంతర వివాహాలకు గాను 22 మందికి రూ.2 లక్షల 15 వేలు అందించారు.