లక్షల ఏళ్ల క్రితమే తొలి హత్య
లండన్: దాదాపు ప్రతిరోజూ బోలెడన్ని హత్యల కథనాలు మనం చూస్తూనే ఉంటాం, వింటుంటాం. అయితే.. తొలి హత్య ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలని ఉందా? ఇదే అంశంపై తాజాగా జరిపిన పరిశోధనలో పలు విషయాలు బయటపడ్డాయి. కొన్ని లక్షల ఏళ్ల కిందటే తొలి హత్య జరిగిందనడానికి పలు ఆధారాలు లభించాయి.
4.30 లక్షల ఏళ్ల కిందటే ఒక మనిషి హత్యకు గురైన ఆనవాళ్లు తాజాగా స్పెయిన్ లో దొరికాయి. దీనిపై రోల్ఫ్ క్వామ్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దాదాపు 20 ఏళ్ల నుంచి నుంచి పరిశోధన చేస్తోంది. దీనిలో భాగంగానే ఉత్తర స్పెయిన్ లో సిమా డీ లాస్ హ్యూసస్ ప్రాంతంలోని గుహలో ఒక పుర్రె లభించనట్లు క్వామ్ స్పష్టం చేశారు. దీంతో పాటు మరో 52 విడి భాగాలు కూడా దొరికినట్లు పేర్కొన్నారు.