first press conference
-
తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్‌ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు. #WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7 — ANI (@ANI) September 20, 2021 Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab. — Narendra Modi (@narendramodi) September 20, 2021 -
ప్రెస్‌మీట్‌కి ముందస్తు కసరత్తా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాక గురువారం నిర్వహించిన తొలి మీడియా సమావేశం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఆయన నోట్స్ చూసుకుంటూ సమాధానాలు ఇవ్వడంతో అందరూ విస్తుపోయారు. 78 ఏళ్ల వయసున్న బైడెన్ ఎన్నో ప్రశ్నలకు రాసుకొని వచ్చిన సమాధానాల్ని చూసి చదివారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తూ కామెంట్లతో హోరెత్తించారు. బైడెన్ సమావేశంలోని ఒక ఫొటోలో ఆయన చేతిలో ఉన్న పేపర్లో కొందరి విలేకరుల ఫొటోలు రౌండ్ ఆఫ్ చేసి ఉండడంతో, కొంత మంది ఎంపిక చేసుకున్న జర్నలిస్టులకే ప్రశ్నలు వేయడానికి ఆయన అవకాశం ఇచ్చినట్టుగా ట్విట్టర్ వేదికగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పేపర్లో మార్క్ చేసి ఉన్న విలేకరుల పేర్లనే ఆయన పిలిచారని, వారేం ప్రశ్నలు అడుగుతారో ఆయనకు ముందే తెలుసునని పలువురు నిందించారు. ‘‘ఇది మీడియా సమావేశం కాదు. సూడో ప్రజాస్వామ్యంలో జరిగిన ఒక నాటకం’’అని న్యూయార్క్ టైమ్స్ కాలమిస్టు కాండెస్ ఓన్స్ విరుచుకుపడ్డారు. బైడెన్ ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్, సరిహద్దు సమస్యలు, వలస విధానంపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బైడెన్ పదవీ ప్రమాణం చేసి రెండు నెలలు గడిచిపోయినా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. -
రష్యాతో ఎలాంటి లావాదేవీలు లేవు : ట్రంప్
న్యూయార్క్: రష్యాతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అగ్రరాజ్య పీఠానికి ఎన్నికైన రెండు నెలల తర్వాత తొలిసారి బుధవారం సాయంత్రం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రష్యా తనతో పాటు అమెరికాను గౌరవించిందని చెప్పారు. ఆయన అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి : పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు? ) ఈ సమావేశంలో ఆయన తన ఆలోచనలను సుదీర్ఘంగా మీడియాకు వివరించారు. పలు మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కంపెనీ వ్యవహారాలను తన కుమారులు చూస్తారని చెప్పారు. హ్యాకింగ్ సమస్యపై మూడు నెలల్లో రష్యా, చైనాతో కలిసి ప్రత్యేక ప్రణాళికను తీసుకువస్తామన్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.