రష్యాతో ఎలాంటి లావాదేవీలు లేవు : ట్రంప్
న్యూయార్క్: రష్యాతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అగ్రరాజ్య పీఠానికి ఎన్నికైన రెండు నెలల తర్వాత తొలిసారి బుధవారం సాయంత్రం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రష్యా తనతో పాటు అమెరికాను గౌరవించిందని చెప్పారు. ఆయన అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
(చదవండి : పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు? )
ఈ సమావేశంలో ఆయన తన ఆలోచనలను సుదీర్ఘంగా మీడియాకు వివరించారు. పలు మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కంపెనీ వ్యవహారాలను తన కుమారులు చూస్తారని చెప్పారు. హ్యాకింగ్ సమస్యపై మూడు నెలల్లో రష్యా, చైనాతో కలిసి ప్రత్యేక ప్రణాళికను తీసుకువస్తామన్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.