బ్యాట్స్‌మెన్ అదుర్స్
అడిలైడ్: టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోను ప్రదర్శించింది. మొదటి రోజు బౌలర్లు సత్తా చాటితే... రెండో రోజు ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. గ్లిడెరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... రెండో రోజు మంగళవారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (114 బంతుల్లో 60; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. విజయ్ (82 బంతుల్లో 51 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు), పుజారా (80 బంతుల్లో 55 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు), సాహా (75 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (54 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రైనా (49 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 55/1తో ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అర్ధసెంచరీలు పూర్తయిన తర్వాత ఇద్దరు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.
తర్వాత కోహ్లి ఆకట్టుకున్నా... రహానే (1), రోహిత్ (23) విఫలమయ్యారు. లంచ్ తర్వాత కెప్టెన్‌తో జత కలిసిన రైనా వేగంగా ఆడాడు. స్లో బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆరో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రైనా అవుటయ్యాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో కోహ్లి, అశ్విన్ (6) అవుటైనా.. చివర్లో సాహా, కరణ్‌లు వీరవిహారం చేశారు. సీఏ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు. లాలర్, షార్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. శుక్రవారం నుంచి జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్... సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ జట్టుతో తలపడుతుంది.
స్కోరు వివరాలు
క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 219
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 51; ధావన్ (సి) టర్నర్ (బి) లాలర్ 10; పుజారా రిటైర్డ్ అవుట్ 55; కోహ్లి (సి) గ్రిమ్‌వేడ్ (బి) షార్ట్ 60; రహానే (సి) కార్టర్స్ (బి) గ్రిమ్‌వేడ్ 1; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) లాలర్ 23; రైనా (సి) కార్టర్స్ (బి) ప్యాటిసన్ 44; సాహా నాటౌట్ 56; అశ్విన్ (సి) అండ్ (బి) షార్ట్ 6; కరణ్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (91 ఓవర్లలో 8 వికెట్లకు) 363.
వికెట్ల పతనం: 1-21; 2-106; 3-120; 4-131; 5-178; 6-233; 7-267; 8-285
బౌలింగ్: లాలర్ 20-2-55-2; మూడీ 17-2-74-0; గ్రెగరీ 6-1-26-0; కాన్వే 10-1-37-0; గ్రిమ్‌వేడ్ 17-3-61-1; ప్యాటిసన్ 7-0-24-1; షార్ట్ 10-1-60-2; టర్నర్ 4-1-24-0.