మలబార్ ఫెస్టివల్ తొలి వీక్లీ డ్రా
విజేత హైదరాబాద్ వాసి
తిరుపతి: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నిర్వహిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్(ఎంజీడీఎఫ్) తొలి వీక్లీ డ్రా తిరుపతిలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి, విజేతలైన వారికి విలువైన బహుమతులు ప్రదానం చేయడం శుభపరిణామం అన్నారు.
ఈ డ్రాలో హైదరాబాద్‌కు చెందిన సిహెచ్. సుహాసిని 250 గ్రాముల బంగారాన్ని గెల్చుకున్నారని సంస్థ ఏపీ, టీఎస్ మార్కెటింగ్ హెడ్ కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. ఈ నెల 12న ప్రారంభమైన ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్ (ఎంజీడీఎఫ్) జనవరి 31వరకూ జరుగుతుందని వివరించారు. తమ అవుట్లెట్లలో రూ.30,000 కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ కూపన్ ఇస్తామని, బంగారు నాణాన్ని కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వీక్లీ డ్రాలు జరుగుతాయని, విజేతలు బహుమతులుగా బంగారు కడ్డీలు గెల్చుకోవచ్చని పేర్కొన్నారు. బంపర్ డ్రాలో విజేతకు కిలో బంగారం బహుమతిగా ఇస్తామని వివరించారు. ఈ ఫెస్టివల్లో 50 కేజీల వరకూ బంగారాన్ని బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు.