వేయిమంది గజ ఈతగాళ్లు
అలంపూర్ : జిల్లాలోని ప్రధాన ఘాట్ల వద్ద వేయిమంది గజ ఈతగాళ్లను నియమిస్తునట్టు మత్స్య శాఖ ఏడీ ఖదీర్‌అహ్మద్ అన్నారు. మంగళవారం అలంపూర్ మండలం గొందిమల్లలోని జోగుళాంబ ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ణా పుష్కరాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనంగా వందమందిని ఎంపిక చేశామన్నారు. వీరికి 400లైఫ్ జాకెట్స్, 200లైఫ్‌బాయ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన ఘాట్ల వద్ద పది బోట్లు అందుబాటులో ఉంటాయన్నారు. సోమశిల, మంచాలకట్ట, బీచుపల్లి, రంగాపురం, గొందిమల్ల, క్యాతూర్lఘాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నారు. పుష్కరాలకు వందమంది మత్స్య శాఖ సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. జోగుళాంబ ఘాట్ వద్ద బోటు, తెప్ప ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ 30మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు.