అండర్–14 రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఐదుగురు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ సంఘం అండర్–14 బాలుర జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. సౌత్ ఇండియా అండర్–14 టోర్నీలో పాల్గోనే ఆంధ్ర అండర్–14 జట్టులో జిల్లాకు చెందిన దత్తారెడ్డి, అర్జున్ టెండూల్కర్, శ్రీయాస్, ప్రశాంత్‌రెడ్డి, మహమ్మద్ కామిల్లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు స్టాండ్‌బైగా ఆనంద్ ఎంపికయ్యాడన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 4న మంగళగిరి క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 5 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు.