ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ యత్నం
ఎర్రగడ్డ మానసిక రోగుల ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు అక్కడ చికిత్స పొందుతున్న ఖైదీలు మరోసారి ప్రయత్నించారు. ఇటీవలే కొందరు కరడుగట్టిన ఖైదీలు సహా మరికొందరు పారిపోవడం, వారందరినీ మళ్లీ పోలీసులు పట్టుకోవడం తెలిసిందే. ఈసారి కూడా పారిపోయే ప్రయత్నం చేసినవారిని ఆస్పత్రి సిబ్బంది గమనించడంతో వారి ప్రయత్నం విఫలమైంది.
తాజాగా మంగళవారం రాత్రి ప్రాంతంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొంతమంది ఖైదీలు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే... ఈ వార్డులో సాధారణంగా అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు, శిక్షపడిన వాళ్లు కూడా ఉంటారు. అయితే పారిపోయే ప్రయత్నం చేసినవాళ్లు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.