ముంచిన వాన
సాక్షి, నెట్వర్క్ : జిల్లాను రెండు రోజులు ముంచెత్తిన వర్షాలు శనివారం కాస్త ఉపశమనం కలిగించాయి. అక్కడక్కడ వర్షాలు పడినప్పటికీ తీవ్రత అంతగా లేదనే చెప్పొచ్చు. ముంపునీరు కాస్త తొలగడంతో పంటపొలాలు బయటపడుతున్నాయి. పలుచోట్ల వరి నేలనంటగా కొన్నిచోట్ల ధాన్యం మొలకలు వచ్చి రైతన్నను ఆవేదనకు గురి చేసింది. రైతులు ముంపునీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన కాలువల్లో ప్రవాహ ఉధృతి తగ్గలేదు. ఏజెన్సీలోనూ వాగులు ఇంకా పొంగిపొర్లుతున్నాయి. మొత్తంగా అల్పపీడన ప్రభావంతో కురిసిన వాన జిల్లాను నష్టాల్లో ముంచిందనే చెప్పొచ్చు.