Flower plants
-
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. ఇక డెంగీ దోమలు మీ దగ్గరే!
సాక్షి, హైదరాబాద్: ఆ మొక్క పేరు మనీ ప్లాంట్. ఇంటి ఆవరణలో ఇది పెంచితే సంపద సంప్రాప్తిస్తుందని కొందరి నమ్మకం. డబ్బు మాటేమోగానీ ఈ ప్లాంట్‌తో డెంగీ దోమలు కచ్చితంగా వచ్చి తీరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం, ఆహ్లాదం కోసం సిటీజనులు పెంచుతున్న పూలు, తీగజాతి మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయడంలో అతిశయోక్తి లేదేమో. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా లు ఉన్నాయి. సాధారణంగా పారిశుద్ధ్య లోపం ఎ క్కువగా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు రావాలి కాని.. సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ 30 శాతం కేసులు అక్కడే.. ► ప్రస్తుతం హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నమోదైన కేసుల్లో 30 శాతం సంపన్నులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌లలో నమోదైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ►పేద, మధ్య తరగతి ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటారు. వీటికోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది. ► వీటిలో డెంగీ దోమలు గుండ్లు పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం.. గుర్తించినట్టు.. పెన్సిల్‌తో రాసి.. ► దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని సిటీజన్లు ఆరోపిస్తున్నారు. ► వారానికోరోజు కూడా ఫాగింగ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి యాంటిలార్వా మందును పిచికారీ చేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. మంచినీటి ట్యాంకుల్లో మందు చల్లకుండానే చల్లినట్లు ఇంటిగోడలపై పెన్సిల్‌తో రాసి చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ►రెండు వారాల్లోనే గాంధీ ఆస్పత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు డెంగీ షాకింగ్ సిండ్రోమ్‌తో (బాలిక, బాలుడు) మృతి చెందారు.నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు కనీసం 20 నుంచి 30 డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. దోమలకు నిలయాలివే.. ► ఇంటి ఆవరణలోని పూల కుండీలు ► మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు ► టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు ► ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు ► కొత్త నిర్మాణాలు, సెల్లార్లు ► తాళం వేసిన నివాసాలు ► విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు ► ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు గాందీలో 40 మంది డెంగీ బాధితులకు చికిత్స గాంధీ ఆస్పత్రి: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మారి కరోనాకు తోడుగా డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 40 మంది డెంగీ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో సింహభాగం చిన్నారులే కావడం గమనార్హం. గత నాలుగు రోజులుగా డెంగీ లక్షణాలతో వచ్చిన మరో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నారుల్లో ముగ్గురుకి డెంగీతోపాటు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గాంధీ పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారి మూడు రోజుల క్రితం డెంగీ షాక్ సిండ్రోమ్‌తో మృతి చెందింది. అందుబాటులో ప్లేట్లెట్లు, మందులు గాంధీ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణకు అన్నిరకాల మందులు, ప్లేట్లెట్లు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. సుమారు 40 మంది డెంగీ బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, వారం రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు డెంగీ కేసులు హైదరాబాద్ 537 రంగారెడ్డి 140 మేడ్చల్ 120 వికారాబాద్ 45 -
వృక్షారామం
ద్రాక్షారామం గురించి విన్నాం, మరి ఈ వృక్షారామం ఏంటి అనుకుంటున్నారా..! ఒకే వేదికగా నక్షత, సప్తర్షి, నవగ్రహ, అశోకవనాలతో విలసిల్లుతూ ఆధ్యాతికతకు ఆలవాలమైంది. దేవతా వృక్షారామంగా పేరొందిన ఆ ఆరామం తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని ఆర్తమూరులో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు. అరవైకి పైగా వృక్షజాతులు. పండ్లు, పూల మొక్కలు. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ అక్కడి చెట్లు శక్తి స్వరూపాలుగా పూజలందుకుంటాయి. నింగిలోని నక్షత్రాలకు నేల మీది వృక్షాలకు ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుంటాయి. అగస్త్య మహాముని నడయాడిన నేల, ఇరువురు జీయర్ల జన్మస్థలమైన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరులోని దేవతా వృక్షారామం ఇందుకు వేదికైంది. మొక్కలంటే ఎనలేని మక్కువతో గ్రామానికి చెందిన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఆధ్యాత్మికవేత్త సత్తి బులిస్వామిరెడ్డి సప్తర్షి ఆరామం, నవగ్రహ ఆరామం, నక్షత్ర ఆరామం, అశోక వనాలతో ఈ వృక్షారామాన్ని నెలకొల్పారు. పచ్చందనమే ప్రధానం ఆధునిక ప్రపంచంలో అంతా కాంక్రీట్ మయమైపోతుండగా పచ్చదనం కనుమరుగైపోతోంది. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు బులిస్వామిరెడ్డి. ఏటా ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేశారు. జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన మొక్కల ప్రాధాన్యతను చాటి చెప్పడం, సనాతన ధర్మం గూర్చి నేటి తరం వారికి తెలియజెప్పే లక్ష్యంతో బులిస్వామిరెడ్డి సొంత స్థలంలో తన తల్లిదండ్రుల పేరిట శ్రీసత్యలక్ష్మణ దేవతావృక్షారామాన్ని నెలకొల్పారు. ప్రత్యేకంగా పనివారిని ఏర్పాటుచేసి కంటికి రెప్పలా మొక్కలను సంరక్షిస్తున్నారు. మహాబిల్వం, ఏకబిల్వం, రుద్రాక్ష, నాగకేసరి, మహాలక్ష్మి ఫలం, దేవకాంచన, యాపిల్ తదితర ఎన్నో చెట్లు ఈ వృక్షారామంలో చూపరులకు కనువిందు చేస్తుంటాయి. అశోకవనంలో చైనా నుంచి తీసుకువచ్చిన చైనా బాల్స్ చెట్టు పూలు సుగంధాలను వెదజల్లుతుంటాయి. వన ఆరామాలు సాధారణంగా అక్కడక్కడ నక్షత్ర వనరామాలను ఏర్పాటు చేసినా చాలావరకు ఒకే రోజు మొక్కలు నాటుతుంటారు. అయితే అర్తమూరులో ఏ రోజు వచ్చే నక్షత్రానికి సంబంధించిన మొక్కను అదే రోజు నాటుతూ 27 రోజులు పాటు పారాయణం, హనుమాన్ చాలీసా, నిత్యహోమం, మాలధారణతో బులిస్వామిరెడ్డి వృక్షారామాన్ని నెలకొల్పారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమి, జమదగ్ని, వశిష్టుడు మొదలైన సప్తరుషులు, బుధ, శుక్ర, చంద్ర, గురువు, రవి, కుజ, కేతు, శని, రాహువు మొదలైన నవగ్రహాలకు ప్రతిరూపాలైన మొక్కలను వృక్షారామంలో నాటారు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో అశోకవనం ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ దేవాలయాల వద్ద నుంచి తీసుకువచ్చిన మట్టితో వనవిహారి రాధా కృష్ణుల విగ్రహాన్ని వృక్షారామంలో ప్రతిష్టించారు. పూజలు నిర్వహించేందుకు యాగశాలను నిర్మించారు. వృక్షారామంలో చెట్ల నుంచి రాలిన ఆకులు, ఎండు కొమ్మలను బయట పడేయకుండా ప్రతీ సోమ, శనివారాల్లో నిర్వహించే యాగానికి వినియోగిస్తారు. ఏ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి ఆ నక్షత్రానికి ప్రతీకైన మొక్కను నాటి సంరక్షిస్తే సకల దోషాలు పోతాయని సనాతనధర్మం చెబుతుంది. దేవతా వృక్షారామంలో స్థానికులు తమ జన్మనక్షత్రానికి సంబంధించిన మొక్కకు నీళ్లు పోసి, చుట్టూ ప్రదిక్షిణలు చేసి పూజలు చేస్తుంటారు. పెనుబోతుల విజయ్‌కుమార్, సాక్షి, మండపేట, తూర్పుగోదావరి మొక్కలతోనే మనుగడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే అది దేవాలయం. దైవానికి ప్రతీకగా మొక్కలు ప్రతిష్టిస్తే అది దేవతా వృక్షారామం. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యం. కుటుంబ సభ్యులందరి జన్మనక్షత్ర సంబంధమైన వృక్షాలను సేకరించి, వాటిని ఒక చోట పెంచి, పూజించడం చాలామందికి సాధ్యంకాదు. గ్రహ, నక్షత్ర దోషాలను నివారించుకుని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో దేవతా వృక్షారామంను ఏర్పాటుచేసి అందరికి అందుబాటులోకి తేవాలన్న నా కల ఇన్నాళ్లకు నెరవేరింది. సత్తి బులిస్వామిరెడ్డి, ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ -
బతుకు పంట!
ఆ రైతు వయసు 73 ఏళ్లు... చేసేది ముప్పాతిక ఎకరం (75 సెంట్లు)లో వ్యవసాయం. ఏడాదికి ఆదాయం అక్షరాలా రూ.1.50 లక్షలపైనే. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ, పాలేకర్ సూచించిన, అయిదు అంతస్తుల సేద్య విధానానికి రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఆ వ్యవసాయ క్షేత్రం కొబ్బరి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలచెట్లతో అడవిని తలపిస్తుంటుంది. నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదన తో అటు ఆరోగ్యం, ఇటు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రోజువారీ పండ్లు, కూరగాయలు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయటమే కాదు, ఆ వయసులోనూ కొబ్బరి చెట్లను అవలీలగా ఎక్కుతూ, గెలలను దింపుతూ, స్వయంగా బజారులో అమ్ముకుంటూ తానే ఒక సైన్యంలా శ్రమిస్తున్నాడు. ఫలితంగానే నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదనతో అటు ఆనందం, ఇటు ఆరోగ్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటుతున్నాడు. ఎందరో రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆ నిత్య కృషీవలుడు నామని రోశయ్య ఆదర్శ జీవన సేద్యంపై ‘సాగుబడి’ కథనం.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం అత్తోట.. రోశయ్య స్వస్థలం. ఊరివెలుపల మాగాణి పొలాల్లో గుబురుచెట్లతో అడవిలా కనిపించేదే ఆయన వ్యవసాయక్షేత్రం. చుట్టూ వరి పండించే మాగాణి భూముల మధ్య ఇదొక్కటే మెట్ట చేను. వాస్తవానికి ఒకప్పుడది మాగాణి భూమే. సేద్యాని కనుగుణంగా మెట్టగా మార్చుకున్నారు రోశయ్య. పెద్దల్నుంచి సంక్రమించిన ఆ భూమికి చుట్టూ గట్లపై కొబ్బరి చెట్లు నాటారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఏటా 10 సెంట్ల చొప్పున మెరక చేసుకుంటూ ఏడెనిమిదేళ్లలో మొత్తం భూమిని మెట్టగా మార్చేసుకుంటూ ఏటా కొన్ని కొబ్బరి చెట్లు నాటుతూ వచ్చారు. వాటితోపాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, దుంప పంటలు, పూలచెట్లతో సహా 23 రకాల మొక్కలు/ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు ప్రస్తుతం రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిచెట్లు–70, నిమ్మచెట్లు–60, జామచెట్లు–8, సీతాఫలం–20, బత్తాయి–4, నారింజ–1, అరటి– 25, దానిమ్మ–2, ఉసిరి–2, నేరేడు–4, మామిడి–4తో సహా సపోటా, బొప్పాయి, మునగ చెట్లతోపాటు 3 నుంచి 5 సెంట్ల విస్తీర్ణం చొప్పున కంద, బెండ, వంగ వంటి కూరగాయల తోటలున్నాయి. ఒక వరుసలో పసుపు విత్తారు. 10 సెంట్లలో పశువుల మేత పెరుగుతోంది. వావిలి, వేప, నల్లేరు, తులసి, ఆముదం, కుంకుడు, రబ్బరు, ఉమ్మెత్త వంటి ఔషధ మొక్కలు, కొన్నిరకాల పూలమొక్కలు ఉన్నాయి. అంతర పంటల సాగులో రోశయ్య మేటి అనిపించుకుంటున్నారు. మినుము, పెసర, పసుపు, కంద పంటలను మూడునాలుగేళ్ల కాలవ్యవధిలో సాగుచేస్తూ వచ్చారు. మినుము పంట చేతికొచ్చాక, బంతి పూల సాగుకెళతారు. ఆ పంట తర్వాత మళ్లీ అపరాలు, మరోసారి పసుపు సేద్యం, ఇంకోసారి మొక్కజొన్న...ఇలా పంటల వైవిధ్యం పాటిస్తూ ఏడాదిలో 365 రోజులు పంట చేతికొచ్చేలా రూపొందించుకొనే ప్రణాళిక లాభసాటి వ్యాపారి వ్యవహారంలా అనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వేసిన నిమ్మతోట ఇప్పుడు బ్రహ్మాండంగా కాపునిస్తోంది. కొబ్బరి చెట్లు ఎత్తు తక్కువ ఉన్నపుడు అరటి ఎక్కువగా సాగుచేశారు. గతేడాది వరకు 20 సెంట్లలో పండించిన పసుపుకు మార్కెట్ ధర ఆశాజనకంగా లేదని ఈ సంవత్సరం విరమించుకున్నారు. ఆ విస్తీర్ణంలో అలోనేరేడు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు రూ.500 కనీస ఆదాయం.. రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లకు 28 ఏళ్ల వయసు. రోజుకు ఒక్కో చెట్టు నుంచి మూడేసి గెలలను దింపుతారు. కొబ్బరి బోండాలను సైకిలుకు కట్టుకుని, అత్తోట గ్రామ సెంటరులో విక్రయిస్తారు. కొబ్బరి బోండాలను విడిగా, సీసాల్లోనూ కోరినవిధంగా ఇస్తారు. అత్తోట, దగ్గర్లోని గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొబ్బరి నీళ్లు అవసరమైన వారు నిశ్చయంగా రోశయ్య ఇంటి తలుపుతడతారు. నిమ్మ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి బోండాలతో రూ.400, నిమ్మకాయలతో రూ.100 చొప్పున రోజుకు రూ.500 ఆదాయాన్ని కళ్లచూస్తున్నట్టు రోశయ్య ఒకింత గర్వంగా చెప్పారు. ఏడాదిలో కనీసం 10 నెలలపాటు ఈ రెండింటిపైనే రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఇతర పండ్లు, కూరగాయలను సొంతానికి వినియోగించుకుంటూ మిగిలినవి మార్కెట్ చేస్తుంటారు రోశయ్య, ఆవిధంగా తన రెక్కల కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పారు. 5 సెంట్ల స్థలంలో వేసిన గజేంద్ర రకం కంద గతేడాది 400 కిలోల దిగుబyì నీ, రూ.6000 ఆదాయాన్నిచ్చింది. 20 సెంట్ల స్థలంలో పసుపు సాగుతో 300 కిలోల ఎండు పసుపు కొమ్ములు వచ్చాయి. దీనితో క్వింటాలు రూ.6,000 చొప్పున రూ.18 వేలకు అమ్మగలిగారు. ఉసిరికాయలపై ఏటా రూ.1,500 వస్తాయి. పచ్చిగడ్డిని ఆవుకు మేతగా వినియోగిస్తున్నారు. చక చకా కొబ్బరి చెట్లు ఎక్కేస్తున్నారు... కొబ్బరి చెట్టు ఎక్కడం అంత సులువు కాదని తెలిసిందే. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు దింపేవారు లేక చాలామంది వాటిని చెట్లకే వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో వున్నా, కూలీ ఖర్చు ఎక్కువ అడుగుతారు. రోశయ్యకు ఈ ఇబ్బందులేం లేవు సుమా! 73 ఏళ్ల వయసులో కొబ్బరి చెట్టును ఇట్టే ఎక్కేస్తున్నారు. మోకాళ్ల నొప్పి వస్తుందనే భావనతో ఇటీవలే చిన్న నిచ్చెన తెచ్చుకున్నారు. నిచ్చెనతో సగం దూరం వెళ్లాక, అక్కడ్నుంచి కాళ్లకు బంధం తాడు, మొలలో కొడవలి, నోట్లో మోకుతో చెట్టు మొదల్లోకి సునాయాసంగా వెళతారు. ఒక్కో గెలను నరికి, మోకుకు తగిలించి, కిందకు జారవిడుస్తాడు. తర్వాత మరో గెల...మొత్తం పది, పదిహేను నిముషాల్లో కొబ్బరి గెలల దింపుడు పూర్తిచేసి దిగొచ్చాడు. పాలేకర్ సూచనలతో సేంద్రియంలోకి.. అనుకోకుండా 2008లో ఒకరోజు పాలేకర్ సమావేశాలకు హాజరైన రోశయ్య, అప్పట్నుంచి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ప్రకతి వ్యవసాయానికి కీలకమైన ఆవును కొనుగోలు చేశారు. మూడేళ్ల తర్వాత దూడలతో సహా వేరొకరికి లాభానికి విక్రయించారు. మళ్లీ ఒంగోలు జాతి ఆవును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ‘నంది’ని పోలిన రెండు ఆవులను పోషిస్తున్నారు. ఆవు వ్యర్థాలను సేకరించుకొని వాటితో జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నామాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, ఇంగువ ద్రావణం వంటి కషాయాలను సొంతం తయారుచేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తరచూ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ రోశయ్య తగిన సలహాలనిస్తున్నారు. ఐదు అంతస్తుల వ్యవసాయ క్షేత్రం.. పాలేకర్ సూచించిన అయిదు అంతస్తుల సేద్యం లక్ష్యంగా వ్యవసాయం చేస్తున్నట్టు రోశయ్య చెప్పారు. భూమిలోపల దుంప పంటలు, పైన ఎత్తు తక్కువలో కూరగాయలు, తర్వాత నిమ్మ, బొప్పాయి వంటి పంటలు, ఆపైన మామిడి, మునగ వంటివి, చివరగా కొబ్బరి చెట్లతో తన వ్యవసాయక్షేత్రాన్ని ఆ విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. చుట్టూ సరిహద్దులో, మరో వరుసలో కొబ్బరి చెట్లు ఉంటే, మధ్యలో ఒకవైపు కూరగాయలు, దుంప పంటలు, కూరగాయలు పెంచుతున్నారు. మరోవైపు పశుగ్రాసాన్ని సాగుచేస్తున్నారు. మధ్యలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెరుగుతూ ఫలాలను అందిస్తున్నాయి. వ్యవసాయశాఖ ఎన్‌పీఎం దుకాణాన్ని రోశయ్యకు మంజూరు చేశారు. వివిధ రకాల కషాయాలను తయారుచేసి రైతులకు అందించటం రోశయ్య విధి. ప్రస్తుతం ఇది ప్రారంభంలోనే ఉంది. లీటరుకు రూ.2 మిగులుతున్నట్టు చెప్పారు. ‘ఇద్దరు పిల్లలూ సెటిలయ్యారు.. నాకూ ఆ ఇంటామెకు ఈ 75 సెంట్ల క్షేత్రం ఉంచుకున్నాం. ఆరోగ్యకరమైన çపండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. మేము తింటూ నలుగురికి అందిస్తున్నాం...ఇంతకన్నా కావాల్సిందేముంది’ అంటూ చిరునవ్వు నవ్వారు రోశయ్య. శారీరక శ్రమ గురించి అడిగితే, కష్టపడితేనే కదా! ఫలితం వచ్చేది’ అంటూ ప్రశ్నించి, నేటి తరానికి రోశయ్య (96665 32921) కర్తవ్య నిర్దేశం చేస్తున్నారు!! స్వయంగా చెట్టెక్కికొబ్బరి కాయలు దింపుతున్న 73 ఏళ్ల రైతు రోశయ్య, చెట్లకు నిండుగా నిమ్మకాయలు – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
రాబడికి దగ్గరి దారేది!
♦ గృహశోభ ఉట్టిపడాలంటే రోజూ గార్డెనింగ్‌కు సమయాన్ని కేటాయించాలి. ♦ మొక్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను గుర్తించాలి. వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ♦ పూల మొక్కలు పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్లో పెంచుకోవచ్చు. నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి.. మనలో చాలా మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల గురించి పెద్దగా తెలియకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఫ్లాటా.. ప్లాటా లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేంట్లో పెట్టుబడులు పెడితే మంచి ఆదాయమొస్తుందనే అంశంపై ఈ వారం సాక్షి రియల్టీ ప్రత్యేక కథనం. - సాక్షి, హైదరాబాద్ నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. ముఖ్యంగా విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యమే బెటర్.. పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. ఎందుకంటే మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం.. కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చ.అ.కు రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి వస్తుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులుంటాయి కూడా. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు సుమీ. మొదటిసారైతే ఇల్లే ఉత్తమం.. మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతల వారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. ఇరవై శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది. నివాస సముదాయాల రంగంలో ఏటా 12-15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్ట్‌ను సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. కాబట్టి, ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక... నిర్వహణ కూడా మెరుగ్గా జరపాలనే విషయం మరవొద్దు. కొత్త పోకడ.. ప్రమోటర్లు స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా 8-10 శాతం సేవా రుసుము తీసుకుని.. కొనుగోలుదారులకు ‘ప్రాపర్టీ మేనేజ్మెంట్’ సేవల్ని అందించే సరికొత్త పోకడకు పలు నిర్మాణ సంస్థలు శ్రీకారం చుట్టాయి. అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే.. నిర్మా ణం పూర్తయిన తొలినాళ్లలో అద్దెదారులు ఎక్కువగా రాకపోవచ్చు. ఒక ఐదారు నెలలదాకా ఈ పరిస్థితి ఉండొచ్చు. అయితే అన్నివేళలా ఇలా జరుగుతుందని కాదు. వాణిజ్య భవనమున్న స్థలాన్ని బట్టి.. ముందే అద్దెదారుల్ని స్థలాన్ని తీసుకోవచ్చు. ఓ కన్నేయాల్సిందే.. నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది. -
అపార్ట్మెంట్లలో అడవి!
అపార్ట్మెంట్లలో మొక్కలు పెంచుకోవడమే కష్టమని అనుకుంటున్నారా...? మరి ఇటలీ కంపెనీ ఒకటి ఏకంగా అడవినే పెంచే ప్రయత్నాలు చేస్తోంది. బాస్కో వర్టికాలీ (ఎత్తై అడవి) అనే పేరుతో మిలాన్‌లోని పోర్టా నువోవా జిల్లాలో 80,112 మీటర్ల ఎత్తు ఉండే రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో వివిధ రకాల చెట్లు, పూలమొక్కల్ని పెంచే ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణం దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో ఇప్పటికే 900 చెట్లను పెంచుతున్నారు. వీటితోపాటు పొదలు, 11 వేల పూల మొక్కలు కూడా ఉంటాయి. ఈ చెట్లు, మొక్కలను నేలపై పెంచాలంటే 2.68 ఎకరాల నేల కావాలట.